ఎన్నో మంతనాలు.. చర్చలు.. భేటీలు.. తీవ్ర సప్పెన్షన్ కు తెరదించుతూ కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసింది. అందరు అనుకున్నట్టుగానే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికే మొగ్గు చూపింది. రేసులో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. రేవంత్ వల్లే పార్టీ కి గత వైభవం వస్తుందని భావించింది. ఎన్నో సంప్రతింపులు జరిపి అధిష్ఠానం రేవంత్ రెడ్డిని సెలక్ట్ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కమిటీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రకటించగానే తెలంగాణ అంతటా ఆయన అభిమానులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఇక పీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
Also Read:-టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి..?
విముక్తి కల్పిస్తాం
ఆచరణకు అమలుకానీ హామీలు ఇచ్చి కేసీఆర్ గద్దెనెక్కారని, త్వరలో కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తానని అన్నారు. ఈటలను బీజేపీలోకి పంపింది కేసీఆర్ అని, బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను పార్టీకి తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని అన్నారు. అన్ని వర్గాలవారి సాయంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నమ్మకాన్ని నిలబెడతానని, తెలంగాణ కలలను నెరవేరుస్తానని అన్నారు. సీనియర్ నేతలను కలుసుకొని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.