శాలిని అందరికీ గుర్తుండే ఉంటుంది. బేబి శాలినిగా తెలుగులో ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారి అనంతరం తమిళ హీరో అజిత్ కుమార్ భార్యగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దాదాపు సినిమాలకు దూరమైందామె. దాదాపు 20 ఏళ్లుగా ఆమె సినిమాలు చేయలేదు. మళ్లీ ఆమె మొహానికి మేకప్ వేసుకోబోతోంది. మణిరత్నంతో ఆమెకు ‘సఖి’తో ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ పేరుతో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు.
ఇందులో శాలినిని ఓ పాత్ర కోసం అడిగారట మణిరత్నం. వెంటనే ఆమె ఓకే చెప్పేసింది. శాలిని చివరి చిత్రం 2001లో వచ్చింది. ‘పిరియాధ వరం వెండం’తర్వాత ఇప్పుడు ‘పొన్నియన్ సెల్వన్’ చేస్తోంది. ఇందులో భారీ తారాగణం ఉంది. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరికి తోడుగా ఇప్పుడు శాలినీ పేరు బయటికి వచ్చింది. అయితే ఆమెది గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లైకా సంస్థ, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఏ.ఆర్. రెహమాన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని చెబుతున్నారు. ఇది చారిత్రక కథాంశం. ఐశ్వర్యాలక్ష్మి, అశ్విన్ కాకుమాను, జయరామ్, లాల్, మోహన్ రామన్, రియాజ్ ఖాన్, విజయ్ కుమార్, నిళల్ గల్ రవి తదితరులు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ ఈ సినిమా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర విశేషాలను అధికారికంగా ఇంతవరకు వెల్లడించలేదు.
Must Read ;- నాగ్ మూవీలో అజిత్ డాటర్











