బాలీవుడ్ ప్రముఖులు కొత్త రకం ఫ్యాషన్ వేర్లను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఎప్పటికప్పుడు హీరో, హీరోయిన్లు సరికొత్త లుక్స్ లో కనిపించడం కోసం ఫాషన్ డిజైనర్లు కూడా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఇప్పటికే అనేక మంది బాలీవుడ్ హీరోయిన్లు సరికొత్త ఫ్యాషన్స్ తో అభిమానులను సందడి చేస్తున్నారు. వారి ఫాషన్ దుస్తులను అనుకరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తన దుస్తులపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుంది. తన శరీర రంగుకు సరిపోయే కలర్స్ ను మాత్రమే ఎంచుకుంటుంది.
కంగనా స్టైల్ ను ఆమె అభిమానులలో ఎక్కువ మందు ఫాలో అవడానికి ట్రై చేస్తారు. తాజాగా ఆమె వేసుకున్న వింటర్ ఫ్యాషన్ వేర్ కోసం ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. కంగనా రనౌత్ భారీ భద్రత మధ్య ఆదివారం నాడు ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఆమె ధరించిన దుస్తుల మూలంగా అక్కడ ఉన్న వారి చూపులు పక్కకు తిప్పుకొని విధంగా కంగనా కనబడింది. ప్రయాణం కోసం కంగనా శరీరానికి అతుక్కొని, మోకాళ్ల క్రింద వరకు ఉన్న ఒక బూడిద రంగు పెన్సిల్ స్కర్ట్ ను ఎంచుకుంది. ఆ స్కర్ట్ కు మందపాటి బూడిద రంగుతో నిలువు గీతాలు ఉన్నాయి. అంతేకాకుండా మందపాటి బూడిద రంగు, తెలుపు కలగలిసిన టాప్ ను ధరించింది.
దుస్తులపై ఒక పొడవాటి బూడిద కోటును కూడా ఎంచుకుంది అందంగా కనిపించింది. ఆమె కాళ్లకు మోకాలి-హై హీల్డ్ బూట్లు ధరించడంతో తను వేసుకున్న దుస్తులకు అదనపు ఆకర్షణ లభించిందనే చెప్పాలి. ఆమె బూడిద, తెలుపు రంగులతో కూడిన ఒక హ్యాండ్ బ్యాగ్ ను తన చేతితో పట్టుకున్నారు కంగనా. కరోనా మహమ్మారి ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని ఆమె ముఖం చాలా వరకు తెల్లటి మాస్క్ తో కప్పి ఉంచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి.
Must Read ;- నీరెండలో తేనేటిని సేవిస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్