బాలీవుడ్, టాలీవుడ్.. ఏ వుడ్ స్టార్స్ అయినా.. టూర్ వెళ్లాలి అనుకుంటే.. వారి ఛాయిస్ మాల్దీవులే. బాలీవుడ్ లో టైగర్ ష్రాఫ్-దిషా పటాని, వరుణ్ ధావన్, సోఫీ చౌదరి, కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు, మౌని రాయ్, టాలీవుడ్ లో నాగచైతన్య, సమంత.. ఇలా సినీ ప్రముఖులు ఏమాత్రం టైమ్ దొరికినా మాల్దీవులు టూర్ వేసేస్తున్నారు. రీసెంట్ గా నాగచైతన్య, సమంత మాల్ధీవులు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఇక అందాల బొమ్మ హన్సిక కూడా ఇటీవల మాల్టీవులు వెళ్లింది. తన బ్రదర్ ప్రశాంత్ మోత్వానీతో కలిసి మాల్దీవులు వెళ్లింది.
అక్కడ ప్రెట్టీ రాప్ స్కర్ట్ వేసుకున్న హన్సికా.. మాల్దీవుల్లోని రిసార్ట్స్ ల్లో చక్కర్లు కొట్టింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా.. తన షేర్ చేసిన ఫోటోలకు క్యాప్షన్ కూడా పెట్టింది. అది ఏంటంటే… మత్సకన్యలు నిజమైనవి.. శాస్త్రవేత్తలు మిమ్మల్ని ఫూల్స్ చేయడం లేదు..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ విధంగా తనని తాను ఓ మత్సకన్యగా చెప్పింది. చాలా తక్కువ వయసులోనే కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు సినిమాలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది.
తొలి సినిమాలోనే తన అందంతో కుర్రకారు మనసులు దోచుకుంది. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ఈ అమ్మడు మాల్దీవుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. తన బాడీ వంపుసొంపుల్ని ప్రదర్శించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వాళ్లు తన గ్లామర్ తో హీటెక్కిస్తుంది అంటూ కామెంట్స్ పెట్టారు. ఇటీవల సినిమాలతో ఆకట్టుకోలేని హన్సిక హాట్ ఫోటోలతో మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది.
Must Read ;- మాల్దీవుల తీరాన్ని తాకిన భారతీయ అందాలు