తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా ఎన్నికైన తర్వాత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌గా పార్టీ అధిష్ఠానం తనను ప్రకటించిన వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయిన రేవంత్ రెడ్డి పార్టీకి చెందిన పలువురు సీనియర్లను వరుస పెట్టి కలుస్తున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు జానారెడ్డి, వి.హన్మంతరావులను కలిసిన రేవంత్ సోషల్ మీడియాను ఓ రేంజిలో ఊపేస్తున్నారు. తాజాగా మంగళవారం రేవంత్ వర్గం వదిలిన ఓ ఫొటో మరింతగా వైరల్ అయ్యిందనే చెప్పాలి. ఆ ఫొటోలో రేవంత్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నమ్మినబంటు సూరీడు కనిపించి అందరికీ షాకిచ్చారు.
ధర్మపురి అరవింద్‌తో ఫొటో కూడా వైరలే!
వైఎస్సార్ వెన్నంటి నడిచిన సూరీడు… వైఎస్సార్ మరణం తర్వాత కొంతకాలం పాటు ఆ కుటుంబంతోనే కనిపించారు. ఆ తర్వాత జగన్‌పై కేసులు నమోదు కావడం, జగన్ ఏకంగా జైలుకు వెళ్లడం, ఈ క్రమంలో జగన్ కేసుల దర్యాప్తును చేపట్టిన సీబీఐ పలుమార్లు సూరీడును విచారించడం… ఇలా వరుసగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత వైఎస్సార్ ఫ్యామిలీకి దూరంగా జరిగిన సూరీడు అసలు ఎక్కడ ఉన్నారన్న విషయం ఎవరికీ తెలియదు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారన్న విషయం కూడా తెలియదు. అలాంటిది మొన్నటికి మొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
రేవంత్‌ను కలిసిన కారణమేమిటో?
తాజాగా టీపీసీసీ చీఫ్‌గా ఎంపికైన రేవంత్‌ను కలిసిన సూరీడు… రేవంత్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయింది. అసలు ఏ కారణంగా రేవంత్‌ను సూరీడు కలిశారన్న విషయంపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. వైఎస్సార్ బతికున్నంత కాలం కాంగ్రెస్‌లోనే ఉన్నారు కదా… ఆ కారణంగానే టీపీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్‌ను అభినందించేందుకే సూరీడు ఆయనను కలిశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే… గత కొంతకాలం క్రితం రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలోనూ సూరీడు కనిపించి ఆసక్తి రేకెత్తించారు. కారణం ఏదైనా.. తాజాగా రేవంత్‌తో కలిసి సూరీడు దిగిన ఫొటో వైరల్‌గా మారిపోయింది.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు ఖాయం: గోనె ప్రకాశ్ రావు జోస్యం