విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి ఆయన పుట్టిన రోజు నాడు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలన్నింటి నుంచి ప్రత్యేక మర్యాదలతో, ప్రసాదాలు, కానుకలు సమర్పించాలని ఏపీ దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు.
దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం దేవాదాయ శాఖ ఇచ్చిన మెమోను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు అడిగినమీదట- తాము కూడా ప్రభుత్వానికి ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నట్లు విశాఖ శారదాపీఠం తరపున లాయర్ కోర్టుకు తెలపడంతో ఆ మెమోను ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టయింది.
Also READ ;- అనుబంధం..ఎప్పటినుంచో
అసలు విషయం ఏంటంటే..
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి రాష్ట్రంలోని 23 దేవాలయాల్లో ప్రత్యేక మర్యాదలు చేసేలా దేవాదాయశాఖను ఆదేశించాలని పీఠాధిపతి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆగమేఘాలపై స్పందించిన ప్రభుత్వం దేవాదాయశాఖకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద సరస్వతికి ఆలయ అధికారులు, అర్చకులు ఆయన జన్మదినం నాడు ఆలయ మర్యాదలతోపాటు, కానుకలు, ప్రసాదాలు సమర్పించాలని దేవాదాయ శాఖ రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాల ఈవోలకు ఆదేశాలిచ్చింది.
ప్రత్యేక మర్యాదలు పొందేందుకు స్వరూపానందకు ఉన్న అర్హత ఏంటంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈలోగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిల్ వేయడంతో వివాదం కోర్టుకు చేరింది. దీనిపై విచారించిన హైకోర్టు దేవాదాయశాఖ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తాము ఇచ్చిన లేఖను కూడా ఉపసంహరించుకుంటున్నట్టు శారదాపీఠం తరపు న్యాయవాది కోర్టుకు తెలపడంతో వివాదానికి తెరపడినట్టయింది.
ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడంతో అత్యుత్సాహం
అధికారులు ఈ విషంలో అత్యుత్సాహం కనబరిచారు. జగన్ సీఎం కావాలని స్వరూపానంద గతంలో యజ్ఞాదికాలు నిర్వహించి ఉండడం, సీఎం అయిన తర్వాత.. జగన్ పలుమార్లు ఆయన ఆశ్రమాన్ని సందర్శించి.. తన భక్తి ప్రపత్తులను అపారంగా చాటుకుంటూ ఉండడంతో.. అధికార్లు కూడా స్వరూపానంద నుంచి వచ్చిన లేఖకు అతిగా స్పందించారు. మొత్తం వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు సమసిపోయింది.
Also Read ;- అప్పన్న సేవ అంటే అధికారుల్లో భయమెందుకు?