హీరోయిన్ ప్రణీత పెళ్లి చేసుకుందండోయ్. సడన్ గా ఆమె పెళ్లి వార్త వైరల్ అయ్యింది. ప్రణీత అనగానే పెద్ద పెద్ద కళ్లతో ఆకట్టుకునే రూపం కనిపిస్తుంది. వరుడు ఓ బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అతని పేరు నితిన్. ఆదివారం ఈ వివాహం జరిగినట్టు సమాచారం. ‘అత్తారింటికి దారేది’ చిత్రం నటిగా ఆమె మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులోని ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే.

కరోనా కష్టకాలంలో ఆమె చేపట్టిన సేవాకార్యక్రమాలతో మరోసారి జనాన్ని ఆకర్షించింది. ప్రణీతకు చాలా సినిమా అవకాశాలు వచ్చినా ఎందుకోగాని స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కరోనా నిబంధనలు కారణంగా నిరాడంబరంగా ఈ వివాహం జరిగినట్టు సమాచారం. ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో చూడాలి. పోకిరి కన్నడ చిత్రం పోర్కీ ద్వారా ప్రణీత హీరోయిన్ గా పరిచయమైంది.
ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. బావ, ఏం పిల్లో ఏం పిల్లడో, రభస, పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, హలో గురూ ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హంగామా 2 చిత్రంలో నటిస్తోంది. హీరోయిన్ గానే కాకుండా రెండో హీరోయిన్ గానూ ఆమె చిత్రాల్లో నటించింది. కరోనా సమయంలో వలస కూలీలకు తన వంతు సహాయాన్ని అందించింది.
వరుడు నితిన్ కూడా బెంగుళూరుకు చెందినవారే. తన పెళ్లి గురించి ప్రణీత మాట్లాడుతూ ఇది లవ్ కమ్ అరెంజెడ్ మ్యారెజ్ అని ప్రకటించింది. నితిన్ తనకు ఎంతోకాలంగా తెలుసని చెప్పింది. ఇక పెళ్లితో తమ బంధాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇరు కుటుంబాలకు విషయం చెప్పామని, ఇరు పక్షాలవారు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నామని వివరించింది. ‘నా పెళ్లి ఎలా అయితే జరగాలని కలలు కన్నానో అలానే జరిగింది. కరోనా కారణంగా అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు’ అని ప్రణీత వివరించింది.
Must Read ;- నెటిజెన్ కు దిమ్మతిరిగే సమాధానమిచ్చిన హాట్ బ్యూటీ











