Telugu Biggboss Season 5 Update :
తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఆకట్టుకుని రికార్డ్ టీఆర్పీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రియాల్టీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు నాలుగు సీజన్ లు సక్సస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఈ నాలుగు సీజన్ లు ఒకదానికి మించి మరొకటి రికార్డ్ టీఆర్పీ సాధించి సరికొత్త రికార్డులు సాధించాయి. బిగ్ బాస్ 4 కంప్లీట్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ 5 ఎలా ఉండబోతుంది..? ఈసారి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇవ్వనున్నారు.? సరికొత్తగా ఎలా ఎంటర్ టైనర్ చేయనున్నారు.? అనేది ఆసక్తిగా మారింది.
కింగ్ నాగార్జున ఈసారి కూడా హోస్ట్ చేస్తుండడంతో బిగ్ బాస్ 5 పై మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.
బిగ్ బాస్ 5 ప్రొమోలో నాగార్జున ఇక్కడ కిక్కు టన్నుల కొద్దీ వస్తుంది అని చెప్పడంతో.. ఈ షో ఎలా ఉండబోతుందని మరింత ఆతృత పెరిగింది. ఫస్ట్ సిరి ఎంట్రీ ఇవ్వగా.. లాస్ట్ లో యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చారు. నాగ్ గతంలో హోస్ట్ గా చేసిన రెండు సీజన్ల స్టార్టింగ్ ఎపిసోడ్స్ తో రికార్డు స్ధాయి టీఆర్పీ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసిన నాగ్ ఇప్పుడు మళ్లీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తారా అనేది ఆసక్తిగా మారింది. సీజన్ 4 కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ కి 18.5 టీఆర్పీ రాగా ఇప్పటికి ఇదే హైయెస్ట్ గా ఉంది.
ఆదివారం రాత్రి స్టార్ట్ అయిన బిగ్ బాస్ 5 చాలా సందడిగా జరిగింది. నాగ్ ఎప్పటిలాగే అదరగొట్టేశారు. ఈసారి జనాలకు తెలిసిన వారి కంటే తెలియని వారే ఎక్కువుగా ఉన్నారు. సినీ తారల గురించి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్లనే కంటెస్టంట్లుగా తీసుకున్నారు. 90 శాతం సామాన్య జనానికి తెలియని వాళ్లే ఉన్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. నాగ్ ఈసారి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- టీఆర్పీలో పోటీపడనున్న నాగ్, ఎన్టీఆర్ షోలు