ప్రముఖ తెలుగు కవి, సాహిత్య పరిశోధకుడు, ఆల్ రౌండర్ ఆరుద్ర 95వ జయంతి ఆగస్ట్ 31. కవిగా ‘ త్వమేవాహం ‘ లాంటి కావ్యాలు రాసినా , ” సమగ్రాంధ్ర సాహిత్యం ” పన్నెండు సంపుటాలు రాసినా, తెలుగు సినీ రచయిత గానే ఆయన ఎక్కువ మందికి తెలుసు. అంతేకాదు తెలుగు సినిమా రంగంలో తొలి స్పై యాక్షన్ సినిమా ‘ గూఢచారి116 ‘ కి కథ, మాటలు రాసింది ఆరుద్ర.
ఆయనకు సాహిత్య ప్రతిభ తో పాటు క్రైమ్ నవలల మీద మక్కువ ఎక్కువ . ఇనస్పెక్టర్ వేణు ప్రధాన పాత్ర గా కొన్ని డిటెక్టివ్ నవలలు కూడా రాశారు. అందుకే జేమ్స్ బాండ్ కథలు. కౌబాయ్ కథలు సినిమాల కోసం ఆరుద్రతో రాయించారు. హీరో కృష్ణ కి ఆరుద్ర మీద గురి ఎక్కువ. అందుకే ప్రత్యేకంగా కౌబాయ్ స్టైల్ లో కథ కావాలనీ ” మోసగాళ్లకు మోసగాడు ” రాయించారు. ఆయనకీ ఉన్న ప్రతిభ కారణంగా సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక సినిమాలకీ రాయించారు.
బాపు ‘సంపూర్ణ రామాయణం’కు రచన చేసింది ఆరుద్ర. దీనిక ముళ్లపూడి వెంకట రమణ సహ రచయిత. ‘బాల భారతం ’, ‘యశోద కృష్ణ’ మొదలైన పౌరాణిక చిత్రాలకు రచన చేశారు ఆరుద్ర. క్రైమ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ సర్కార్ ఎక్స్ ప్రెస్’ హిందీ రీమేక్ కి ఆరుద్ర స్క్రీన్ ప్లే రాశారు. వందలాది పాటలతో పాటు చాలా సాంఘిక చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ‘ అఖండుడు , శభాష్ పాపన్న , మల్లె పూవు ‘ సినిమాల్లో నటుడిగా కనిపించారు. కిడ్నీ వ్యాధి తో1998 జూన్ 4 న మరణించారు ఆరుద్ర.