సాధారణంగా హీరోయిన్స్ ను సినిమాల్లోనే కాకుండా.. పలు యాడ్స్ లో కూడా చూస్తుంటాం. అంతే కాకుండా.. షాపు ఓపెనింగ్ కి కూడా హీరోయిన్స్ రావడం తెలిసిందే. దీంతో హీరోయిన్స్ ఫోటోలు పలు షాపుల దగ్గర హోర్డింగ్స్ లో చూస్తుంటాం. సిటీల్లో హీరోయిన్స్ ఫోటోలు పెట్టాలంటే.. పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. అదే పల్లెటూరులో అయితే.. ఇలాంటి పర్మిషన్స్ ఏమీ తీసుకోకుండానే కూల్ డ్రింక్ షోపుల దగ్గర హీరోయిన్ ఫోటోలు పెడుతుంటారు.
అయితే.. ఓ రైతు మాత్రం అందాల చందమామలు కాజల్, తమన్నాల ఫోటోలను తన పొలంలో దిష్టి బొమ్మలుగా పెట్టడం విశేషం. అదేంటి.. హీరోయిన్ ఫోటోలను దిష్టి బొమ్మలుగా పెట్టారా..? అని ఆశ్చర్యపోతున్నారా..? ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి అనే రైతు తన రెండు ఎకరాల్లో మిర్చి పంట పండిస్తున్నాడు.
గతంలో పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక తెగులు సోకి బాగా నష్టపోయాడట. అలా జరగడానికి కారణం తనకు తన పొలానికి నరదిష్టి తగలడమే అని భావించిన ఆ రైతు అందాల చందమామలు కాజల్, తమన్నాల ఫ్లెక్సీలను దిష్టి బొమ్మలుగా పెట్టాడు. ఇలా చేయడం వలన జనాల చూపు ఆ హీరోయిన్స్ పైనే పడింది కానీ.. తన పొలం పై పడలేదని.. అందుకే అనుకుంట ఈసారి పంట బాగా పండిందని చెప్పాడు. అదీ.. సంగతి.
Must Read ;- క్లీన్ క్లీవేజ్ షోతో కాకపుట్టించిన కాజల్ అగర్వాల్











