కరోనా కారణంగా ఈ సమ్మర్ లో రావాల్సిన సినిమాలు వాయిదా పడడం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవ్వడతో.. సమ్మర్ లో విడదుల చేయాలనుకున్న సినిమాలను ఆగష్టులో సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక సమ్మర్ సీజన్ తర్వాత చెప్పుకోదగ్గది దసరా సీజన్. ఈ సీజన్ కు చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రాలను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాతే ఈ రెండు సినిమాల దసరా రిలీజ్ పై క్లారిటీ వస్తుంది.
సమ్మర్, దసరా సీజన్ తర్వాత వచ్చేది సంక్రాంతి సీజన్. ఈ సీజన్ కు ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే హీరోలు, నిర్మాతలు సంక్రాంతికి తమ సినిమాలను భారీ స్ధాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. రానున్న సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయనున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలో ప్రారంభించనున్నారు. బ్యాంకింగ్ లో జరిగే ఆర్ధిక నేరాల నేపథ్యంలో సాగే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది. దీనికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుంటే.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3 కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. వెంకీ, వరుణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఎఫ్ 3 పై పాజిటివ్ టాక్ ఉంది. మరి.. సంక్రాంతికి ఈ మూడు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు పోటీపడనున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి.. వీటన్నింటిలో సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.
Must Read ;- అటు ఆచార్య; .. ఇటు అఖండ;











