తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో ఆయన రోజురోజుకు బలమైన నేతగా ఎదుగుతున్నారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రచారం మొత్తం ఆయన చుట్టే తిప్పుకున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువగా బండి సంజయ్ కామెంట్స్ హాట్ హాట్‌గా మారాయి. దీంతో ఆయన జాతీయ నాయకత్వం దృష్టిలో మంచి మార్కులు సాధించారు.
తాజాగా తెలంగాణలో జిల్లాల్లో పర్యటన
రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా అదికార పార్టీ టార్గెట్‌గా చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను గందర గోళానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వంలోకి వచ్చాక , ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ మాటలే ప్రజలను ఊర్రూతలూగించేవి… ఆయన ఎప్పుడు మాట్లాడతారా అనే వేచి చూసే వారు . ఇప్పుడు ఆదే పరిస్థితి సంజయ్ పట్ల నెలకొంది. సంజయ్ ఎప్పుడు ఏది మాట్లాడినా అది సూటిగా అవతల పార్టీ నేతలకు తగులుతుంది. దీంతో ఆయన మాటలకు ప్రజలు రెస్పాండ్ కాక తప్పని పరిస్థితి ఉంటోంది. తెలంగాణలో ఆయన అధ్యక్షుడు అయిన సమయంలో టీఆర్ఎస్ నుండి పెద్దగా స్పందన వచ్చేది కాదు. ఆయన ఏది మాట్లాడినా పట్టించుకునే వారు కాదు . దుబ్బాక ఉప ఎన్నికతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు ప్రజలను ఆకట్టుకోగా, ఇటు అధికార పార్టీని కలవర పాటుకు గురి చేసి పార్టీ ఓటమికి కారణం అయ్యాయి. సంజయ్ స్ట్రాటజీపై జాతీయ నాయకత్వం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.. ప్రధాని మోడీ , అమిత్ షా, నడ్డాలు నేరుగా ఫోన్ చేసి మరీ ఆయనకు శుభాకాంక్షలు తెలియ జేశారు.
Must Read ;- బండి స్కెచ్.. ఊరూ వాడా బలపడిపోదాం!
పెరిగిన బాధ్యతలు..
తెలంగాణలో సంజయ్ సక్సెస్ ఫుల్ లీడర్‌గా పార్టీ భావిస్తోంది. దీంతో ఆ పార్టీ ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విస్తృతంగా వాడుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా త్వరలో తిరుపతిలో జరిగే ఉప ఎన్నికలో ఆయనతో ప్రచారం చేయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీకి హైప్ తెచ్చేందుకు ముందస్తుగానే ఆయనను తిరుపతి వెళ్లాలని పార్టీ పెద్దలు ఆదేశించనట్టు చర్చ సాగుతోంది. ఈ నెల 24, 25 తేదీల్లో ఆయన తిరుపతి టూర్ ఉండొచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తీరిక లేని షెడ్యూల్ వల్ల ఆయన తిరుపతి పర్యటన వచ్చే నెల మొదటి వారంలో ఉండొచ్చని అంటున్నారు. ఇంకా నోటిఫికేషన్ రాక పోయినా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీ అభ్యర్థిని బరిలో ఉంచాలా లేక బీజేపీ అభ్యర్థినే బరిలో ఉంచాలా అని నిర్ణయించిక పోయినా ముందుగా సంజయ్ వెళ్ళి వస్తే పార్టీకి ఖచ్చితంగా బలం పెరుగుతుందన్న భావనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక తెలంగాణలోనే కాక ఆంధ్రప్రదేశ్‌లో కూడా సంజయ్ తన ప్రభావం చూపిస్తారా.. జాతీయ నాయకుల స్కెచ్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.