అసలే ఉన్న కరోనాతో వేగలేకుండా ఉంటే.. ఈ కొత్త కరోనా ఏంటో అంటూ ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కొందరు ఇది అత్యంత ప్రమాదకరమని, చిన్నపిల్లలపై అత్యంత ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్తుంటే, మరి కొందరేమో ఇది వేగంగా వ్యాప్తి చెందుతున్నమాట నిజమే కానీ, మరణాల నమోదు లేదు కనక అత్యంత ప్రమాదకరం అనుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ కొత్తరకం కరోనా గురించి వదంతుల నమ్మవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇలా పలు అనుమానాలతో ప్రజల మెదడు తొలిచేస్తున్న పలు సందేహాలు నివృత్తి చేయడానికి ‘కొత్త రకం కరోనా’ గురించిన వివరాలు తెలియపరిచారు డాక్టర్ ఎ.వి.ఎస్.రెడ్డి. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్పరివర్తనాలు (mutations) ఊహించినవే..
సాధారణంగా కరోనా స్పైక్ ప్రోటీన్స్ ద్వారా ఒక మనిషి నుంచి మరొకరికి అంటుకుంటుంది. ఈ స్పైక్ ప్రోటీన్స్‌లో వచ్చే మార్పులనే ఉత్పరివర్తనాలు అంటారు. కరోనాలో ఈ మార్పులు కొత్తేమీ కాదు.. ఈ మార్పులు ఊహించినవే. ఇలాంటి మార్పులు వైరస్ పరిణామ క్రమంలో సాధారణంగా చోటు చేసుకుంటాయి. ఇలా జరిగే పరిణామ క్రమంలో ముఖ్యమైనది N501Y. ఇప్పటికి ఇలాంటి పరిణామాలు కొన్ని వేలసార్లు తలెత్తాయి. కానీ ఈ కొత్త ఉత్పరివర్తనం N501Y అనేది కాస్త ప్రమాదకరంగా మారింది.
ఎలా కనుగొన్నారు?
బ్రిటన్‌లోని జెనోమిక్స్ కన్సార్టియం కొవిడ్ మార్పులు మీద ఏప్రిల్ నుండి పరిశోధనలు చేస్తున్నారు. అందులో భాగంగా 1,40,000 కొవిడ్ పేషంట్ల నమూనలపై పరిశోధనలు చేసిన తర్వాత ఈ కొత్త రకం N501Y కనిపెట్టారు. గతంలోని కరోనాతో పోలిస్తే ఇది మరింత సామర్థ్యం కలిగింది కావడం మనం గమనించాలి. అంతేకాదు.. కొవిడ్-19తో పోలిస్తే.. ఈ కొత్త కరోనా మరింత వేగంగా, సులభంగా వ్యాప్తి చెందుతుంది. పరిశోధకుల నివేదిక ప్రకారం ఈ కొత్త కరోనా 70 శాతం వేగంగా వ్యాపిస్తుంది. కానీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిశోధనలు జరుగుతున్నాయి.
Must Read ;- కొత్తరకం కరోనా గురించి షాకింగ్ నిజాలు బయటపెడుతున్న శాస్త్రవేత్తలు
అలాగే అవి ఆ వైరస్ పరిణామ క్రమంలో ఒక భాగం కూడా. అలా జరిగిన ఉత్పరివర్తనాలలో ముఖ్యమైనది ఈ N501Y ఉత్పరివర్తనం. ఇప్పటికే అనేక వేల ఉత్పరివర్తనలు తలెత్తాయి. అవన్నీ కూడా అంతగా ప్రభావం చూపేవి కాలేకపోయాయి. కానీ ఈ N501Y ఉత్పరివర్తనం మాత్రం కొంచెం ప్రమాద ఘంటికలు మోగిస్తుంది.2/7
— Dr.A.V.S Reddy (@dravsreddy) December 22, 2020
కొత్త కరోనా అత్యంత ప్రమాదకరమా?
ఈ ప్రశ్నకు సమాధానం ప్రస్తుతానికైతే కాదనే చెప్పాలి. ఎందుకంటే, ఈ కొత్తరకం కరోనా తొందరగా వ్యాప్తి చెందుతుందని కొద్దిపాటి ఆధారాలు లభించాయి. కానీ, అత్యంత ప్రమాదకరం అనడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. గతంలో కరోనా సోకినపుడు ఎలాంటి లక్షణాలు, పరిణామాలు చోటుచేసుకున్నాయో.. ప్రస్తుతం కూడ అలాంటివే కనబడుతున్నాయి.
కనిపెట్టిన టీకాలు కొత్త కరోనాను ఆపగలవా?
కరోనా కొత్తగా రూపాంతరం చెందినా కూడా వ్యాక్సిన్ పనిచేస్తుంది. ఎలా అంటే, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్నా వ్యాక్సిన్‌కి వైరస్‌లో ఉన్న స్పైక్ ప్రోటీన్స్‌కి వివిధ ప్రాంతాలకు వ్యతిరేకంగా యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి కరోనాలోని మార్పులు వ్యాక్సిన్ ప్రభావాన్ని అడ్డుకునే అవకాశాలు లేవు. ఒకవేళ భవిషత్తులో వైరస్‌లో ఊహించని మార్పులు చెందితే.. అప్పుడు కూడా ప్రస్తుత వ్యాక్సిన్ పూర్తిగా పనిచేయకపోవడం ఉండదు.. కానీ చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆపై యాథావిధిగా అప్పటి వైరస్‌పై మార్పులు చేసిన వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పచ్చు.
ఇలా ప్రతి విషయాన్ని వివరించారు డాక్టర్.. మరి తెలుసుకున్నారుగా.. డాక్టర్ ఎ.వి.ఎస్.రెడ్డి చెప్పిన సమాచారం ప్రకారం, కరోనా వైరస్‌లోని కొద్ది మార్పుల వల్ల ఏర్పడినదే ఈ కొత్త కరోనా. దీని వ్యాప్తి వేగవంతమైనా కూడా.. అత్యంత ప్రమాదకరం అనడానికి ఆధారాలు లేవు. కానీ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండడం మంచిది.
Also Read ;- భారత్‌లో జనవరిలో వ్యాక్సినేషన్‌కు శ్రీకారం?