సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఫైటర్ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పూరి – ఛార్మిలతో పాటు కరణ్ జోహర్ నిర్మాత. ముంబాయిలో చాలా వరకు షూటింగ్ చేసారు. అయితే.. ఇంకా ముంబాయిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి వుంది. అలాగే విదేశాల్లో షూటింగ్ చేయాలి. కరోనా తగ్గిన తర్వాత షూటింగ్ చేద్దామని ఆగారు.
ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రకు మలయాళ అగ్ర హీరో సురేష్ గోపీని తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. యాక్షన్ కింగ్ అర్జున్ ని తీసుకున్నారట. ఇది పాన్ ఇండియా మూవీ. అర్జున్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల సినిమాల్లో నటించారు. అందుచేత అర్జున్ ని తీసుకుంటే అన్ని భాషలకు పరిచయం ఉంది. పైగా సినిమాలో పాత్రకు కూడా కరెక్ట్ సెట్ అవుతారనే ఉద్దేశ్యంతో అర్జున్ ని ఫైనల్ చేసారని సమాచారం.
మాఫియా నేపధ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో ఉండే యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటాయి అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధించాలి అనుకుంటున్నారు. ఈ సినిమా సక్సస్ పై టీమ్ అంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. జనవరి నుంచి తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీని వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరి.. ఫైటర్ పూరికి, విజయ్ కి మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
Must Read ;- ప్రభాస్.. సలార్ లో ముస్లిం లీడరా..?