కరోనా.. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. చాలా దేశాలు కరోనా విజృంభనకు అడ్డుకట్ట వేయలేకున్నాయి. కొన్ని దేశాల్లో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూనే ఉన్నా.. మరోవైపు కేసులు కూడా భారీగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా కొన్ని దేశాలు కొవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఉంది. కరోనాను కట్టడి చేయడంలో తమ దేశాలను ముందుండి నడిపిస్తున్నది ఎక్కువగా మహిళలే కావడం విశేషం. మరి ఆ దేశాలేమిటో.. ఆ అధ్యక్షులెవరో.. వారు చేపడుతున్న పటిష్ఠ చర్యలేమిటో.. ఓ సారి చూద్దామా..!
న్యూజిలాండ్ – జసిండా ఆర్డెన్
2017, అక్టోబర్లో న్యూజిలాండ్ మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జసిండా ఆర్డెన్.. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనాను కూడా తమ దేశంలో కట్టిడి చేసి తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ప్రజలకు అత్యవసర సేవలను కొనసాగిస్తూ.. అక్కడ లాక్ డన్‌ని కఠినంగా అమలు చేయడం వల్లే కరోనాని జయించగలిగారు.
Also Read ;- భారతీయ అమెరికన్లకు కీలక పదవులు.. వైట్ హౌస్‌లో మనవాళ్లే 17మంది
ఐస్ ల్యాండ్ – క్యాట్రిన్ జకోబ్డాట్టిర్
ఐస్ ల్యాండ్ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన జకోబ్ దేశాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్లారు. స్త్రీ-పురుషులకు సమాన వేతనం అందించడం, లింగ సమానత్వం విషయంలో కూడా ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) ప్రకటించే లింగ సమానత్వ ర్యాంకుల్లో ఎన్నో సార్లు అగ్ర పీఠాన్ని అధిరోహించిన ఈ దేశం.. కరోనాని కట్టడి చేయడంలోనూ అగ్రస్థానంలో ఉందని చెప్పచ్చు. ఇందుకు కారణం కేవలం క్యాట్రిన్ సమర్థ చర్యలనడంలో సందేహం లేదు.
Also Read ;- ఆ విమానం నడిపేది మహిళా పైలెట్లే..!
ఫిన్లాండ్ – సనా మారిన్
సాధారణ సేల్స్ ఉమెన్ స్థాయి నుండి ఫిన్లాండ్ దేశ ప్రధానిగా ఎదిగారు సనా మారిన్. 2019 డిసెంబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా.. అనతి కాలంలోనే ఉద్యోగులకు వారంలో మూడు రోజలపాటు సెలవులు లాంటి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇలా ప్రధాని బాధ్యతలను చేపట్టిన కొద్ది కాలానికే కొవిడ్ రూపంలో పెను సవాలును ఎదుర్కొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ పెనుముప్పు నుంచి తన దేశాన్ని కాపాడుకుంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read ;- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొదటి మహిళలు వీళ్లే..
డెన్మార్క్ – మెట్టీ ఫెడ్రిక్సన్
చదువుకునే రోజుల నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన మెట్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2019 లో డెన్మార్క్కు ప్రధానిగా ఎన్నికయ్యారు. కరోనా వ్యాప్తిని ముందుగానే పసిగట్టి.. డెన్మార్క్ దేశ సరిహద్దులను మూసివేశారు. విద్యాసంస్థలను మూసివేయడంతో పాటు.. 10 మంది కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు. ఇలా కఠిన చర్యలను తీసుకుంటూనే.. ప్రజలకు అందాల్సిన సేవలను కొనసాగించారీ డేరింగ్ ఉమెన్. ఇలా తన సారథ్య నైపుణ్యంతో.. కరోనా వైరస్‌ను అణచివేస్తున్న అతి కొన్ని దేశాలలో డెన్మా ర్క్‌ని ఒకటిగా నిలబెట్టారు.
మహమ్మారైనా.. మహిళా శక్తి ముందు తలవంచకతప్పదని నిరూపిస్తున్న ఈ అతివలను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచం.. త్వరలోనే కరోనాను తరిమి కొట్టగలదనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కరోనాని కట్టిడి చేస్తున్న మహిశా శక్తికి హాట్సాఫ్..
Also Read ;- పొగరాయుళ్లంటే కొవిడ్‌కి కూడా భయమే!