తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గడిచిన రెండేళ్ల కాలం నుండి విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పట్ల స్పందిస్తూ వారికి అండగా నిలబడుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి అభిమానాన్ని గెలుచుకుంటున్నారు.
విద్యార్థి, నిరుద్యోగ సమస్యల పరిష్కార సాధనలో విజయం.
కరోన సెకెండ్ వేవ్ ప్రమాదం పొంచివున్న సందర్బంగా పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని నారా లోకేష్ విద్యార్థుల పక్షాన పోరాడి విజయం సాధించారు. ఆ సమయంలో ఒక వైపు కరోన, మరో వైపు పరీక్షలపై రోజుకో మాట చెపుతూ ఆందోళనకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం. అ సందర్భంలో విద్యారులను, వారి తల్లిదండ్రులతో, మేధావులతో, వైద్యులతో సమావేశాలు నిర్వహించి పది, ఇంటర్ పరీక్షల నిర్వహించకూడదు అని విద్యార్థుల తరుపున పోరాడి విజయం సాధించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పై అఖిలపక్ష విద్యార్థి, యువజన, సంఘాలతో భేటీ అయిన నారా లోకేష్…ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగులు చేసిన పోరాటాలకు అండగా నిలచి ప్రభుత్వాన్ని కదిలించారు.
గ్రూప్ – 1 అభ్యర్థుల కోసం
అలాగే గత టీడీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన గ్రూప్ 1 ఉద్యోగాలను, వైసీపీ ప్రభుత్వం లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి, ఒక్కో గ్రూప్ 1 పోస్ట్ 10 కోట్లకు అమ్ముకున్నారని గ్రూప్ – 1 అభ్యర్థులు నారా లోకేష్ ను కలవగా, వారితో నారా లోకేష్ జూమ్ సమావేశం ద్వారా మీకు అండగా ఉంటానని చెప్పారు. వెంటనే ఎపిపిఎస్సికి, ముఖ్యమంత్రికి, గవర్నర్ కు లేఖలు వ్రాసి గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సి లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాగా గ్రూప్ – 1 అభ్యర్థులు నారా లోకేష్ చొరవతో హైకోర్టును ఆశ్రయించగా గత జూన్ 16 న గ్రూప్ 1 పరీక్ష ఇంటర్యూ లను తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని ఏపీపీఎస్సి కి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. కాగా ఈ రోజు గ్రూప్ 1 అభ్యర్థులు కోరుకున్నట్టే గ్రూప్ 1 పరీక్ష జబాబు పత్రాలను 3 నెలల లోపల మ్యానువల్ గా మూల్యాంకన చేయాలని ఎపిపిఎస్సి కి కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయంతో గ్రూప్ 1 అభ్యర్థులు విజయం సాధించారు. మెరిట్ అభ్యర్థులు గ్రూప్ 1 ఉద్యోగాలు పొందుతారు.
లోకేష్ కు జై కొడుతున్నయువతరం
నారా లోకేష్ పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయించుటలో విద్యార్థుల పక్షాన పోరాడి విజయం సాధించి, జాబ్ క్యాలెండర్ రద్దు చేసి 2.30 లక్షల పోస్టుల విడుదల కై విద్యార్థి, నిరుద్యోగుల పక్షాన నిలబడి, గ్రూప్ 1 అభ్యర్థుల న్యాయ పోరాటానికి అండగా నిలబడి విజయానికి తోడ్పడినారు. అందుకే ఏపీ లోని విద్యార్థులు, నిరుద్యోగులు నారా లోకేష్ కు జై కొడుతున్నారు.
Must Read ;- ఓటేసిన ‘ఫ్యాన్’కే ఉరేసుకుని..