ఇంతటి అఖండ చరిత్ర కలిగిన కాంగ్రెస్ నేడు ప్రాభావాన్ని కోల్పతుందా అనిపిస్తుంది. ఇటీవల జరిగిన బిహార్, మణిపూర్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్నాటక లో జరిగిన అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే, కనీసం రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్. ఇన్ని అపజయాలు ఎదురవుతున్నా… కాంగ్రెస్ లో అంతర్మధనం మొదలైనట్టు కనిపించలేదు.
బహిరంగ విమర్శలు
ఐదు రాష్ట్రాల్లో ఓటమి అనంతరం లేఖాస్త్రాలను పక్కన పెట్టి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు సీనియర్లు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ బహిరంగానే కాంగ్రెస్ కు చురకలంటించారు. దేశంలో కాంగ్రెస్ ను ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయ జాతీయ పార్టీగా ప్రజలు భావించడం లేదని విమర్శంచారు. ప్రస్తుత పరిస్థితులు, వాటికి సమాధానాలు అధిష్టానానికి బాగా తెలుసునని, కానీ వాటిని గుర్తించి సరిదిద్దుకోవడానికి సిద్ధపడడం లేదంటూ దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పెద్దలు తెలిసీ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది.
Must Read ;- మేల్కొనకపోతే కాంగ్రెస్ కనుమరుగే..!
అంతర్మధన సమయమిది
పార్టీకి ఎల్లప్పుడూ విధేయులుగా ఉన్న వారిలో చిదంబరం ఒకరని చెప్పచ్చు. కానీ, అటువంటి నేత కూడా బహిరంగా తన అసంతృప్తిని తెలియజేశారంటే పార్టీ సినియర్ల మాటలను ఎంతగా పెడచెవిన పెడుతుందో తెలుస్తుంది. ఇటీవల వెల్లడైన ఎన్నికల ఫలితాలు తనకు తీవ్ర వేదనకు గురిచేసాయని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సాధించగలదు. సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ కు కేటాయించిన సీట్లు బిజెపి గత 20 సంవత్సరాలుగా ఓటమి ఎరుగనివి. అటువంటి వాటిని ఒప్పుకుని కాంగ్రెస్ చాలా పెద్ద తప్పు చేసింది.
పార్టీని వీడచ్చు
లోక్ సభ ప్రతిపక్ష నేత, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి సీనియర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని కాంగ్రెస్ లో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పనితీరుపై అసంతృప్తి ఉన్న వారు పార్టీని వీడచ్చంటూ కపిల్ సిబాల్ ని ఉద్దేశించి మాట్లాడడం విమర్శలకు తావిస్తుంది. విమర్శలను స్వీకరించి విచారణ జరిపి సరిదిద్ధాలి కానీ, కొన్ని దశాబ్దలగా కాంగ్రెస్ పార్టీ పురోగతికి తోడ్పడిన సీనియర్లను ఇలా విమర్శంచడం తగదని కాంగ్రెస్ లోని చాలామంది అభిప్రాయం.
సమీక్ష నిర్వహించండి
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతైన కాంగ్రెస్ మేల్కోనకపోతే పార్టీ భూస్థాపితం కావడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు, పార్టీలోని పలు రాష్ట్రాల నాయకులు, కార్యకర్తలు సైతం కాంగ్రెస్ ఓటమికి కారణాలు సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితోపాటు, పార్టీ అభ్యర్థుల ఎంపికలో సమస్యలు ఉన్నాయా లేదా పార్టీ వల్ల అభ్యర్ధులు ఓడుతున్నారా అనే విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని పార్టీ నేతలు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఇలాగే కొనసాగితే, పార్టీలో ముఖ్య నేతలందరూ పార్టీని వీడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
Also Read ;- కాంగ్రెస్ ప్రక్షాళన అటకెక్కినట్టేనా…!