దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. చాలా సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు రాజమౌళి అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడంతో అందరూ హ్యాపీగా ఫీలవుతుంటే.. పవర్ స్టార్ ప్రొడ్యూసర్ మాత్రం సీరియస్ గా ఉన్నారట.
ఇంతకీ ఎవరా ప్రొడ్యూసర్ అంటే.. వకీల్ సాబ్ మూవీని దిల్ రాజుతో కలిసి నిర్మిస్తున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కఫూర్. ఆయన రాజమౌళి పై కోపంగా ఉండడానికి కారణం ఏంటంటే.. బోనీ కపూర్.. అజయ్ దేవగన్ హీరోగా మైదాన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2021 అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఆయన ప్రకటించారు. అయితే.. ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించడంతో రిలీజ్ క్లాష్ ఏర్పడుతుందని బోనీ కపూర్ ఫీలవుతున్నారట.
ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తుంటే.. మైదాన్ లో హీరోగా నటిస్తున్నారు. అంటే రెండు రోజుల వ్యవధిలో అజయ్ దేవగన్ సినిమాలు రెండు రిలీజ్ అవుతాయన్నమాట. దీని మూలంగా కలెక్షన్లు దెబ్బతింటాయని, అసలే లాక్ డౌన్ మూలంగా నష్టాల్లో ఉంటే బాక్సాఫీస్ దగ్గర ఈ పోటీ మరింత నష్టాల్ని తీసుకువస్తుందని.. అందుచేత రాజమౌళి కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది అని బోనీకపూర్ బాధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి.. బోనీ కపూర్ కామెంట్స్ పై రాజమౌళి స్పందిస్తారేమో చూడాలి.
Must Read ;- షాక్ లో రాజమౌళి సంతోషంలో అభిమానులు











