June 24, 2026 9:25 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Movie Reviews

ప్లే బ్యాక్ (రివ్యూ)

ఏ కాలంలోనైనా ప్రేమ కథలు షరామామూలే. కానీ టైమ్ మిషన్ తరహా ప్రేమ కథలు మాత్రం తెలుగు తెరకు కొత్తే. అలా రూపొందిన సినిమానే ‘ప్లే బ్యాక్’. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.

March 5, 2021 at 3:03 PM
in Movie Reviews
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కాలంలోకి ప్రయాణం చేసే కథలు సాధారణంగా హాలీవుడ్ లోనే పుడుతుంటాయి. ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఇలాంటి ప్రయోగాలు చేయరు. దానికి కొంత కారణం బడ్జెట్ పరిమితులు కూడా. తెలుగులో టైమ్ మిషన్ కథాంశంతో వచ్చిన తొలి చిత్రం బాలకృష్ణ హీరో సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘ఆదిత్య 369’, ఆ తర్వాత సూర్య హీరోగా ‘24’ వచ్చింది. ఈసారి ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో వచ్చిన చిత్రమే ‘ప్లే బ్యాక్’. దర్శకుడు సుకుమార్ లెక్కల మాస్టారు అయితే, ఆయన సహాద్యోగి జక్కా హరిప్రసాద్ ఫిజిక్స్ మాస్టారు అనుకోవాలి. సుకుమార్ తో ఉన్న స్నేహం కారణంగా సినిమా రంగానికి వచ్చి తొలి ప్రయత్నంగా ఈ సినిమా రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రసాదరావు పెద్దినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

కథలోకి వెళితే..

ఇది టైమ్ మెషిన్ లవ్ స్టోరీ అనుకోవాలి. కాలంలోకి ప్రయాణం చేయడం అనేది కొత్త లైన్. ఈ సైన్స్ ఫిక్షన్ కు ప్రేమ కథను ముడిపెట్టి మలిచారు. కార్తి (దినేష్ తేజ్) మన తరం కుర్రాడు. జర్నిలిస్ట్ కావాలనేది అతని లైఫ్ యాంబిషన్. అలా ఉద్యోగ ప్రయత్నాలు చేసి టీవీ 5లో ఉద్యోగంలో చేరతాడు. అద్దె ఇంటి యజమానితో గొడవ కారణంగా వేరే ఇంటికి మారతాడు. ఆ ఇంట్లోకి వెళ్లాక అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ కనిపిస్తుంది. ఈరోజుల్లో ఈ ఫోన్ ఎక్కడికి అనుకుంటాడు. ఇంతలో ఆ ఫోన్ రింగవుతుంది. అవతలి నుంచి ఓ యువతి గొంతు. ఆమె పేరు సుజాత (అనన్య నాగెళ్ల). తనకు కావసింది తను కాదని, రాంగ్ నంబర్ అని పెట్టేస్తాడు. అయినా ఆమె మళ్లీ ఫోన్ చేస్తుంది. సరే యువతి ఫోన్ చేస్తే ఊరికే ఎలా ఉండబుద్దేస్తుంది మాటలు కలుపుతాడు.

ఆమె అతన్ని ఓ సాయం అడుగుతుంది. అతను అంగీకరిస్తాడు. ఆమెకు సెల్ ఫోన్, వెబ్ సైట్లు లాంటి వాటి గురించే తెలియదు. ఆమె కోసం పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళితే కనిపించదు. చివరికి అతను తనకు తెలిసిన అంశాలన్నీ క్రోడీకరించి చూసి కంగుతింటాడు. ఆమె 1993లోని యువతి. తను 2019లో ఉన్నాడు. తనకూ ఆమెకూ కాలంలో ఈ తేడా ఏమిటో అతనికి అర్థం కాలేదు. మరో షాక్ ఏమిటంటే అసలు ఆ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఎప్పుడో కట్ చేసేశారు. అయినా ఆమె నుంచి ఫోన్ వస్తూనే ఉంది. పైగా ఆమెకీ అతనికీ ఓ కనెక్షన్ కూడా ఉంది. ఆమె పెద్ద ప్రమాదంలో ఉందని కూడా అర్థమైంది. ఇలాంటి పరిస్థితిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా.

ఎలా తీశారు? ఎలా చేశారు?

సైన్స్ ఫిక్షన్ కథ కాబట్టి దర్శకుడు చాలా థ్రిల్లింగ్ అంశాలతో దీన్ని రూపొందించారు. ఈ కథకు స్ఫూర్తి ఏదైనా గానీ దర్శకుడు తనకున్న ఫిజిక్స్ నాలెడ్జిని దీని మేకింగ్ కోసం బాగానే ఉపయోగించుకున్నారు. ఇలాంటి అంశాన్ని సులభంగా చెప్పగలగాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. ఎక్కడా అతికి అవకాశం ఇవ్వకుండా ప్రేక్షకుడు ఉత్కంఠను మిస్సవకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కథకు కొత్త మొహాలు కాకుండా కాస్త తెలిసిన నటులు అయి ఉంటే కథ మీద ఇంకాస్త ఆసక్తి పెరిగేది.

కొత్త వారు కావడంతో సహజత్వానికి దగ్గరగా సినిమా సాగింది. అనన్య, దినేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. అనవసర కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి దర్శకుడు వెళ్లలేదు. ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా బాగా కుదిరింది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. దర్శకుడిగా జక్కా హరిప్రసాద్ కు మంచి పేరు వచ్చినట్టే. లెక్కల మాస్టారుకు తోడుగా మరో ఫిజిక్స్ మాస్టారు దొరికినట్టే.

తారాగణం: దినేష్ తేజ్, అనన్య , అర్జున్ కళ్యాణ్, మూర్తి, స్పందన, టీఎన్ ఆర్, చక్రపాణి, అశోక్ వర్ధన్, కార్తికేయ తదితరులు.
సంగీతం : కమ్రన్
సినిమాటోగ్రఫీ : బుజ్జి.కె.
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి బొంతల
నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాత : ప్రసాదరావు పెద్దినేని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి ప్రసాద్ జక్కా
విడుదల: 5-3-2021
ఒక్క మాటలో: కొత్త ప్రయత్నం
రేటింగ్: 3/5

– హేమసుందర్ పామర్తి

Tags: Ananya nagallaDinesh TejDinesh tejajakka hariprasadlatest telugu movie songslatest telugu movieslatest telugu trailersleotopmusic director kamranpayback 2telugu trailerplay back public talkplaybackplayback ananyanagallaplayback movieplayback movie public talkplayback movie reviewPlayback movie review and ratingPlayback Newsplayback public reviewPlayBack Public TalkPlayBack Reviewplayback teluguplayback telugu movieplayback telugu movie reviewplayback trailer 2021socialposttelugu latest full moviestelugu latest movies 2021Telugu Movietelugu movie reviewtelugu movie reviewstelugu playback movieఅనన్య నాగళ్లదినేష్ తేజప్లే బ్యాక్
Previous Post

హీరో కోసం నదిలోకి దూకేసిన అభిమాని

Next Post

జీవీఎల్ వ్యాఖ్యలతో రగిలిపోతున్న ఓటర్లు..  విశాఖలో బీజేపీ అడ్రస్ గల్లంతేనా?

Related Posts

యానిమల్ (రివ్యూ)

by Leo Cinema
December 2, 2023 8:15 pm

యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా తర్వాత రూపొందిన...

భగవంత్ కేసరి (రివ్యూ)

by Leo Cinema
October 19, 2023 8:47 pm

బాలయ్య సినిమాల పరంగా ఇప్పుడున్న క్రేజ్ వేరు. అలాగే వరుస హిట్లతో దూసుకుపోతున్న...

కింగ్ ఆఫ్ కొత్త (రివ్యూ)

by Leo Editor
August 24, 2023 2:04 pm

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మంచి క్రేజ్ ఉంది. మహానటి, సీతారామం చిత్రాల...

భోళాశంకర్ (రివ్యూ)

by Leo Editor
August 12, 2023 7:05 am

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ రూపొందించిన భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల...

జైలర్ (రివ్యూ)

by Leo Editor
August 10, 2023 5:02 pm

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కానీ కొన్నేళ్లుగా దండగే...

బ్రో ఏంచేశాడు? (review)

by Leo Editor
July 28, 2023 10:26 pm

పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ...

మాయా పేటిక (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 2:38 pm

మాయాపేటిక.. ఈ పేరు చూడగానే ఇదేదో కొత్తగా అనిపిస్తుంది.సెల్ ఫోన్ నే ప్రధాన...

నిఖిల్ స్పై మూవీ (రివ్యూ)

by Leo Editor
June 30, 2023 1:26 pm

నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన స్పై సినిమా భారీ అంచనాల నడుమ విడులైంది. భారీ...

పురాణ పురుషుడితో ఓంరౌత్ ప్రయోగం (రివ్యూ)

by Leo Editor
June 16, 2023 1:52 pm

ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు విడుదలైంది. ఓంరౌత్ దర్శకత్వంలో ఈ...

హంట్ మూవీ రివ్యూ

by Leo Editor
January 26, 2023 6:37 pm

హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

Nidhi Agarwal Hot Pics in Yellow Saree

అక్క‌డ పోటెత్తి!.. ఇక్క‌డ ఠారెత్తి!

ఈషా రెబ్బా… ఈ నైట్ లైఫ్ ఏమిటబ్బా!

ముఖ్య కథనాలు

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist