ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి నటుడు అనిపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆతర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కమర్షియల్ సక్సస్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమా అయితే.. ఓ సంచలనం. అతన్ని ఓవర్ నైట్ స్టార్ ను చేసేసింది. ఆతర్వాత గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో సక్సస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు ఈ సెన్సేషనల్ స్టార్. కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకోవడమే కాకుండా.. యూత్ లో స్పెషల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ.. కన్నడ.. మలయాళంలోనూ రిలీజ్ చేశారు. అయితే..
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన డియర్ కామ్రేడ్ మూవీ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా నిర్మాణం సమయంలోనే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రెఢీ అయ్యారు. అయితే.. సినిమా ప్లాప్ కావటంతో వెనక్కి తగ్గారు. ఇదిలా ఉంటే.. ప్లాప్ అయిన డియర్ కామ్రేడ్ మూవీ ఆన్ లైన్ లో మాత్రం అదరగొట్టేసింది. ఊహించని రీతిలో సక్సెస్ కావటమే కాకుండా.. రికార్డు స్థాయి వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం.
ఈ మూవీని గత సంవత్సరం జనవరి 19న యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. ఆన్ లైన్ లో రిలీజ్ చేసిన 24 గంటల వ్యవధిలోనే 1.20కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. దాదాపు సంవత్సరంన్నర అవుతున్న వేళ.. మరో రికార్డును సొంతం చేసుకుంది. అది ఏంటంటే… తాజాగా ఈ మూవీ 250 మిలియన్ వ్యూస్.. అంటే 25 కోట్ల వ్యూస్ ను రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. వ్యూస్ మాత్రమే కాకుండా.. లైక్స్ ను సైతం భారీగా రావడం.. రికార్డుల మీద రికార్డుల్ని సొంతం చేసుకోవటం విశేషం.
Must Read ;- విజయ్ – పూరి లైగర్ మూవీలో మైక్ టైసన్











