July 3, 2026 5:37 AM
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మరో ‘పరీక్ష’లో లోకేష్ సక్సెస్.. జగన్ ఫెయిల్

ఏపీలో పరీక్షల నిర్వహణ అంశం ప్రభుత్వం VS ప్రతిపక్షాలు అన్నట్లుగా మారి ఎట్టకేలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటర్‌, పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

June 25, 2021 at 11:49 AM
in Andhra Pradesh, Editors Pick, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

పలు రాష్ట్రాలు టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నా ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. పరీక్షలు పెట్టి తీరతామని ప్రభుత్వం పట్టుబట్టింది. విద్యార్థుల ప్రతిభా పాటవాలు నిర్ణయించాలంటే పరీక్షలే ఏకైక మార్గం. అదే అవసరం. అయితే ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యం, భౌతిక దూరం, కొవిడ్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని చాలా రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. ఒక వేళ కొన్ని పోటీ పరీక్షలకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించాయి. ఇక ఏపీలో పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం పట్టుబట్టడం, అదే సమయంలో టీడీపీ ప్రథమంగా ఆందోళనకు దిగడం, ఇతర రాజకీయ పక్షాలు, కొన్ని సంఘాలు, సంస్థలు కూడా ఆందోళన చేపట్టాయి. అయినా ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి తీరతామని చెప్పడంతో పాటు ప్రతిపక్షాలపై, ప్రతిపక్ష నాయకులపై కొందరు మంత్రులు నోరు పారేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మొత్తం మీద ఏపీలో పరీక్షల నిర్వహణ అంశం ప్రభుత్వం VS ప్రతిపక్షాలు అన్నట్లుగా మారింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఇంటర్‌ రెండో సంవత్సరంతో పాటు… మొదటి సంవత్సరం, పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

సమర్థించుకునే యత్నం..

కాగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సూచనల నేపథ్యంలో గురువారం రాత్రి సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏపీ విద్యా మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రెస్ మీట్‌లో పరీక్షలు రద్దుచేస్తున్నట్టు చెప్పారు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని, ఏపీ విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము కూడా పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘‘ఇంటర్‌ పరీక్షలపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగిందని, అయితే జూలై 31లోపు ఇంటర్‌ ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి కనీసం 45రోజుల సమయం పడుతుందని, జులై 31లోపు ఫలితాలు వెల్లడించడం సాధ్యం కాదని, అందుకే రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఇక మార్కులు, గ్రేడింగ్‌లు తదితర అంశాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.

లోకేష్‌కు అభినందనలు..

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు రావడంతో పాటు ఏపీ ప్రభుత్వం పరీక్షల రద్దుకు నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏకేస్తున్నాయి. టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నారా లోకేష్ తోపాటు నాయకులు పలు ట్వీట్‌లు చేశారు. జనసేన పార్టీ కూడా ఇదే కోణంలో ట్వీట్‌లు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయంగా తెలుగు తమ్ముళ్లు ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. పదో తరగతి పరీక్షల రద్దు కోసం నారా లోకేష్  ముందు నుంచి పోరాటం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థి సంఘాలకు అండగా ఉండడంతోపాటు తానే స్వయంగా ఆందోళన్లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా లేఖలు రాశారు. ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ న్యాయపోరాటం కూడా చేశారు. పరీక్షల రద్దేయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు.

Must Read ;- పరీక్షల నిర్వహణపై ప్లానేది.. సుప్రీం ధర్మాసనం అసంతృప్తి 

పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులకు అభినందనలు.విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసింది.రెండు నెలల పోరాటం తరువాత @ysjagan గారు దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషం.(1/4)#MentalMama pic.twitter.com/35QCpjIa3C

— Lokesh Nara (@naralokesh) June 24, 2021

వరుస ట్వీట్లు..

ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాక లోకేష్ పలు ట్వీట్‌లు చేశారు. పరీక్షల రద్దు కోసం పోరాడి విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అభినందనలు అని ట్వీట్ చేయడంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడిన రాక్షస క్రీడ ముగిసిందని, రెండు నెలల పోరాటం తరువాత జగన్ దిగొచ్చి పరీక్షలు రద్దు చెయ్యడం సంతోషమన్నారు. మరో ట్వీట్‌లో ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఏప్రిల్ 18 న తాను మొదటి లేఖ రాసిన సమయంలోనే పరీక్షలు రద్దుచేసి ఉంటే విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ వృథా అయ్యేది కాదని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయం ఉండేదని చెప్పారు. ప్రభుత్వం కనీస మానవత్వంతో ఆలోచించి ఉంటే విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇంత మానసిక ఆందోళన ఉండేది కాదని, మెంటల్ మామ అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదని, తుగ్లక్ నిర్ణయాలతో రెండు నెలల పాటు విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు హింసించారన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో చివాట్లు తినే పరిస్థితి మరోసారి తెచ్చుకోకండి, ఇప్పటికైనా ప్రతిపక్షం అడిగే న్యాయమైన డిమాండ్లు పరిగణనలోకి తీసుకోవాలని జగన్ రెడ్డి గారిని కోరుతున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు. మొత్తం మీద లోకేష్ ట్వీట్లను రీషేర్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు వైరల్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా విద్యార్థులకు అండగా లోకేష్ నిలబడ్డారని, లేని పక్షంలో ప్రభుత్వానికి ఎదురు చెప్పే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని, పరీక్షలు నిర్వహిస్తే లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాల ఆరోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చేదని పలువురు ట్వీట్ చేస్తున్నారు. లోకేష్ డిమాండ్‌కి ప్రజా మద్దతు ఉందని, అందుకే లోకేష్ , విద్యార్థులు, తల్లిదండ్రులు పరస్పరం తోడుగా నిలిచారని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరో భంగపాటు..

అదే సమయంలో ప్రభుత్వం కూడా భంగపాటుకు గురైందని చెప్పవచ్చు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత,  మూడో వేవ్‌ వస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని ప్రతిపక్షాలు, మేధావులు, విద్యావేత్తలు దాదాపు రెండు నెలలుగా సూచిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎవరు చెప్పినా మేం వినం. మేం చేయాలనుకున్నదే చేస్తామనే రీతిలో వ్యవహించారు. ఇక CBSE, ICSEలతోపాటు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 21 రాష్ట్రాలు 10+2 పరీక్షలను  రద్దు చేశాయి. కొన్ని యూనివర్సిటీలు గ్రాడ్యూయేట్స్ పరీక్షలూ రద్దు చేశాయి. అయితే పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకు తీరని నష్టం అనే వాదన తెరపైకి తెచ్చి ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ అంశంతో పాటు పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థులకే నష్టమని చెబుతూ వచ్చారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పలేక పోయింది. ఒక్కో పరీక్ష గదిలో 15 నుంచి 18 మంది విద్యార్థులను కూర్చోబెడతామని ప్రభుత్వం చెప్పింది. అయితే విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే ప్రభుత్వం చెబుతున్న ప్రకారం పరీక్షల నిర్వహణకు  మొత్తం 34,634 గదులు అవసరమవుతాయని, అన్ని గదులు అందుబాటులో ఉన్నాయా అని సుప్రీం ప్రశ్నించింది. మరికొన్ని అంశాల విషయంలో అఫిడవిట్ సరిగ్గా లేదని వ్యాఖ్యానించడంతో పాటు ఒక రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంటుందని ఊహించలేదని వ్యాఖ్యానించినట్లూ వార్తలు వచ్చాయి. అదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకం అని నిరూపించుకోవాలని అనుకోవద్దు. పరీక్షలపై ఇతర రాష్ట్రాల బోర్డులు ఒక పద్ధతిని అనుసరిస్తున్నా ఏపీ ప్రభుత్వం ఎందుకు అలా చేయడం లేదు. ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలి. పరిష్కారం దొరకని సమస్య కాదు. విద్యార్థులను రిస్క్‌లోకి నెట్టాలనుకోవద్దు అని వ్యాఖ్యానించింది. జులై 31లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించాలని సూచించింది. కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంతో పాటు తక్కువ సమయం ఉన్నందున పరీక్షలు రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Must Read ;- లోకేశ్ మాట విని ఉంటే సుప్రీం అక్షింతలు త‌ప్పేవిగా

Tags: lokesh-succeeded-in-cancelling-exams-in-aptelugu news
Previous Post

కోపంతో కాదు ఆవేదనతో పుట్టిన ప్యానల్ మాది: ప్రకాష్‌ రాజ్

Next Post

కొవిడ్ కట్టడి : 51 వేలకు దిగొచ్చిన కేసులు!

Related Posts

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

by లియో డెస్క్
July 2, 2026 12:51 pm

మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

by లియో డెస్క్
July 1, 2026 9:56 am

ఉమ్మడి చిత్తూరు జిల్లాను తోతాపురి రాజకీయం గట్టిగా హీటెక్కిస్తోంది. తోతాపురి మామిడి రైతులకు...

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

by లియో డెస్క్
June 27, 2026 7:07 pm

ఐదేళ్ల జగన్‌ పాలన దెబ్బకు వైసీపీ కంచుకోటలన్నీ మంచులా కరిగిపోతున్నాయి. ఫ్యాన్‌ గుర్తును...

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

by లియో డెస్క్
June 27, 2026 5:58 pm

ఆంధ్రప్రదేశ్ మైనింగ్ రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తూ..కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో...

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Actress Riya Sen keeps teasing her fans with sultry photos

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Lavanya Tripathi

మంత్రం 108 సార్లే ఎందుకు చదవాలి?

Actress Daksha Nagarkar Hot Cleavage Stills

ముఖ్య కథనాలు

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!

నాడు చేతిలో టెంకె.. నేడు మొసలి కన్నీరు.. మామిడి ధరలపై వైసీపీ డ్రామా..

బొత్స టీమ్‌ టీడీపీలోకి జంప్‌.. విజయనగరంలో వైసీపీ ఖాళీ..!

సీమ గడ్డపై బంగారం… ఫ్యాక్షన్‌ స్థానంలో పసిడి సిరి…

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist