మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ పోటీపడుతున్న విషయం తెలిసిందే. మూడు నెలల ముందు నుంచే మా ఎన్నికల సందడి మొదలవ్వడం.. ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే.. మరింత రసవత్తరంగా ఎన్నికలు జరగనున్నాయి . దీంతో కామన్ మేన్ కు సైతం ఈ ఎన్నికల పై ఆసక్తి ఏర్పడింది. అయితే.. అందరి కంటే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి ప్రకాష్ రాజ్ ప్రచారం మొదలెట్టేశారు. న్యూస్ ఛానల్స్ కి ఇంటర్ వ్యూలు ఇస్తూ.. తనని మా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఏం చేయాలనుకుంటున్నారో, తన ప్లాన్ ఏంటో చెబుతూ వచ్చారు. ఈ రోజు ప్రకాష్ రాజ్.. తన ప్యానల్ సభ్యులతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారో చూద్దాం.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ఇందులో పొలిటికల్ పార్టీలు వచ్చేశాయి. కేసీఆర్, కేటీఆర్, జగన్ ఇలా.. ఎవరెవర్నో ఇందులోకి లాగుతున్నారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టాను. సినిమా బిడ్డలు అనే ఈ ప్యానల్ సడన్ గా వచ్చింది కాదు. ఒక సంవత్సరం నుంచి బయట మాట్లాడకుండా అసోసియేషన్ కి మనం ఏం చేయాలి అని సీరియస్ గా ఆలోచిస్తున్నాం. దాదాపు మూడు సంవత్సరాలుగా చూస్తునే ఉన్నాం. ఏం జరుగుతుందో..? సున్నిత మైన కళకారులు ఉన్న అసోసియేషన్ ఎందుకు అందరికీ ఎంటర్ టైన్మెంట్ అయిపోయింది అని ఆలోచించాను. ఇది పొలిటికల్ పార్టీ కాదు.
ఎలాంటి వారు ఈ ప్యానల్ లో ఉండాలి? చిత్తశుధ్దితో వర్క్ చేసే వారు ఎవరు? అని గ్రౌండ్ వర్క్ చేశాం. ఇక్కడ ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న వాళ్లే . ఆ ఫ్యామిలీ అంటూ.. ఈ ఫ్యామిలీ అంటూ అని హెడ్డింగులు పెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. దీన్ని పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు. గతంలో ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ల వల్ల అవ్వలేదు అంటే మనం ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అని రావాలి అంతే తప్పితే విమర్శకూడదు. ఇది పదవి కోసం చేసే పోటీ కాదు. ఇంటర్నల్ మేటర్. నేను తేడా చేస్తే నన్ను బయటకు పంపించే ప్యానల్ ఇది. దీనిలోకి చిరంజీవిగారిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. అందరూ కలిసే ఉంటారు కదా.
ఎవరు ఫోన్ చేసినా భయం వేస్తోంది. ఒక సున్నితమైన కళాకారుల అసోసియేషన్ ఇది. సినిమా అనేదే భాష. కళకారులు అనేది యూనివర్శల్. గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ అనలేదు. తొమ్మిది నందులు అందుకున్నప్పుడూ నన్ను అనలేదు. ఇప్పుడు నాన్ లోకల్ అనేది ఎందుకొచ్చింది.? ఆస్ట్రేలియా, అమెరికా ఎక్కడికి వెళ్లినా తెలుగువారికి గౌరవం ఇస్తున్నారు. కోపంతో పుట్టిన ప్యానల్ కాదు.. ఆవేదనతో పుట్టిన ప్యానల్ ఇది. అర్హతను చూడండి. ప్రణాళికలు తయారు చేస్తాం. పేరు పేరునా ఇస్తాం. ఇది ‘మా’ ఇల్లు అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తాం. ఎన్నికల్లోకి వచ్చింది.. పాపులర్ అవ్వడానికి కాదు..మేము ఆల్రెడీ పాపులర్. అకారణంగా మాతో శత్రుత్వం వద్దు అనుకుంటున్నాం. పదవి కోసం ఎవరూ రాలేదు. నేను చాలా అదృష్టవంతుడిని. నాకు ప్రశ్నించేవాడు కావాలి. అలాంటి వాళ్లే మా ప్యానల్ లో ఉన్నారు’ అని వివరించారు.
ప్రకాష్ రాజ్ కు చిరంజీవి మాటిచ్చారు: నాగబాబు
ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చిరంజీవి అన్నయ్య మద్దతు ప్రకాటించారని నటుడు, నిర్మాత నాగబాబు ప్రకటించారు. ఈ సమావేశానికి హాజరైన నాగబాబు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ మొదటే అన్నయ్య చిరంజీవిని కలిసి మాట్లాడారని, అన్నయ్య కూడా ఆయనకు మద్దతిచ్చారని తెలిపారు.
Must Read ;- ప్రకాష్ రాజ్ ని మా అధ్యక్షుడుగా ఒప్పుకోలేం