రవితేజ ఈ ఏడాది కూడా తన దూకుడు చూపించాడు. మొదటి నుంచి తాను అనుసరిస్తూ వస్తున్న పద్ధతినే ఈ సారి కూడా ఆచరణలో పెట్టాడు. ఏడాదికి మూడు సినిమాలు తన నుంచి థియేటర్లకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ప్రయత్నం కరోనా కారణంగా కుదరలేదు. లాక్ డౌన్ తరువాత థియేటర్లకు వచ్చిన ‘క్రాక్’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. పెద్దగా గ్యాప్ లేకుండా ‘ఖిలాడి’ సినిమాను కూడా థియేటర్లకు తీసుకురావాలని రవితేజ భావించాడు. కాకపోతే కరోనా కాలు అడ్డుపెట్టేసింది.
లాక్ డౌన్ ఎత్తేయగానే రవితేజ చకచకా ‘ఖిలాడి‘ సినిమాను పూర్తిచేశాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, త్వరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి కథానాయికగా పరిచయం కానుంది. ఇక డింపుల్ హయతి సోయగాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు ఓపెన్ కాగానే పరిస్థితులు అంచనా వేసుకుని, ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, రవితేజ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించాడు.
శరత్ మండవ అనే కొత్త దర్శకుడిని రవితేజ పరిచయం చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా, రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాకి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘సబ్ కలెక్టర్’ గా రవితేజ ఈ సినిమాలో కనిపించనున్నాడు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. చాలా ఫాస్టుగా ఈ సినిమా షూటింగును కూడా పూర్తిచేసి సంక్రాంతి బరిలో నిలపాలనేది రవితేజ అభిప్రాయంగా తెలుస్తోంది. రవితేజ స్పీడ్ గురించి తెలిసినవారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమేనని అనుకుంటున్నారు.
Must Read ;- ఆ.. టైటిల్ తో బాలయ్య వస్తాడనుకుంటే.. రవితేజ వస్తున్నాడా?











