పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘వకీల్ సాబ్’ సినిమాకు సంబంధించిన సినిమా కథ మనకు తెలిసిందే. ఇక పవన్ తన తర్వాత సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమాకు ‘విరూపాక్ష‘ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ కథలో పవన్ ఒక బందిపోటుగా కనిపించనున్నాడని తెలిసిన విషయమే.
అయితే క్రిష్ సినిమా తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కథ మాత్రం ఎవరికి తెలియదు. ఆమధ్య కాలంలో పవన్, హరీష్ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడని పుకార్లు షికార్లు చేశాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరో కొత్త విషయం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే పవన్ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్స్ లో కనపడనున్నాడని, అందు కోసం హరీష్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్.
ఇక ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే తండ్రి పాత్ర కోసం ఇతర నటులను ఎంపిక చేయకుండా పవన్ తోనే చేయించాలని ఆలోచనలో ఉన్నాడట హరీష్. తెరపైన ఒక్క పవన్ కళ్యాణ్ కనపడతేనే ఫాన్స్ పూనకంతో ఊగిపోతారు మరి ఇద్దరు పవన్ కళ్యాణ్ లు కనపడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో తెగ వైరల్ అవుతోంది. ఇదే కనుక నిజమైతే అభిమానులకు పండగే మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Must Read ;- పవన్‌కు హస్తినలో రంగు పడుతుందా?