దేశంలో విజన్ అన్న పేరు వినిపిస్తే.. ఠక్కున గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో.. అంటే.. 90వ దశకంలోనే విజన్ 2020 పేరుతో 20 ఏళ్ల తర్వాతి రాష్ట్రాన్ని చూడగలిగారాయన. నాడు ఆయన నాటిన బీజాలే.. నేడు వటవృక్షాలై ఫలాలందిస్తున్నాయ్. రాష్ట్ర అభివృద్ధిని శాసిస్తున్నాయ్. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఆయన అధికారంలో లేకపోయినా.. ఆయన విజన్ పనిచేస్తోంది. నేటి పాలకులు ఆయన ఘనతను ఒప్పుకునేందుకు సిద్ధంగా లేకపోయినా.. నాటి మధుర స్మృతులు అప్పుడప్పుడు ఏదో విధంగా జ్ఞప్తికి వస్తూనే ఉంటాయి. నాడు చంద్రబాబు నాటిన భారత్ బయోటెక్ మొక్క.. నేడు కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ పూలు పూయగా.. నాడు ఐటికి ఆయన వేసిన పునాదులే.. నేడు రాష్ట్ర ఆదాయానికి కేంద్ర బిందువులుగా మారాయి.
నాటి ఆయన విజన్ దేశానికే ఆదర్శమనీ ఎందరో కీర్తించారు. ఐఎఎస్ ఆఫీసర్ల నుంచి వీదేశీ ప్రధానుల సైతం వారి పరిపాలనా దక్షతను చూసి అబ్బురపడ్డారు. అలాంటి వారిలో కెప్టన్ జి.ఆర్.గోపినాథ్ ఒకరు. కెప్టన్‌గా ఆర్మీలో సేవలందించారు.. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడిగా ఎదిగారు. సామాన్యుడి పార్టీగా పేరు గాంచిన ఆమ్ ఆద్మీలో అడుగిడి, అనతికాలంలోనే పార్టీ నుంచి బయటకొచ్చారు.. రచయితగా కూడా పుస్తకాలను రచించారు. వాటిలో 2011లో విడుదల చేసిన ‘సింప్లీ ఫ్లై-ఎ డెక్కన్ ఒడిస్సీ’ అనే పుస్తకంలో తన అనుభవానలను, ఎదిగిన క్రమాన్ని రాసుకొచ్చిన గోపినాథ్.. చంద్రబాబు నాయుడి గారి గురించి రాసిన మాటలు కొన్ని నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో చంద్రబాబు విజన్ గురించి, వారి ఆలోచనల గురించి స్పష్టీకరించారు.
Must Read ;- దటీస్ విజనరీ లీడర్ అంటున్న ‘చంద్రబాబు’ అభిమానులు
ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు..
‘కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ర్టాల మధ్య పోటీతత్వన్ని నెలకొల్పేవి. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలు పోటీ పడేవి. అందులో పెట్టుబడులను ఆకర్షించే ముఖ్య సాధనం మౌలిక సదుపాయాలు. అందుకోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యంగా వాటిపైన దృష్టి పెట్టారు. ఆ సమయంలో ఐటి రంగంలో బెంగళూరు దూసుకుపోతుంది. దాన్ని తలదన్నెలా హైదరాబాద్‌ను ఐటి రంగంలో మొదటి స్థానానికి తీసుకురావాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష. దేశానికి, హైదరాబాద్‌ను టెక్నాలజీ రాజధానిగా మార్చాలనుకున్నారు. అందుకోసం రాష్ట్రాన్ని ఐటి రంగంలో పరుగులు పెట్టించారు.. అంతేనా.. రాష్ట్రానికి సిఇఓగా పనిచేస్తున్నారంటూ అవార్డును కూడా అందుకున్నారు.
కర్నాటక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో చంద్రబాబు ఇచ్చిన ప్రసంగానికి నేను కూడా హాజరయ్యాను. ఆయన అక్కడ అందించిన స్పీచ్‌లో అక్కడి వారిని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వనించారు. ప్రభుత్వం అందుకు అవసరమైన ప్రతి ఒక్క పని చేస్తుందని తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వారి పెట్టుబడులను ఆహ్వానించినందుకు.. ఆనాటి ప్రతిపక్షాలు చంద్రబాబు చర్యలను ఖండించాయి. మామూలుగా ప్రతి పక్షాలు.. అధికార పక్షం చేసే ప్రతి పనిని ఖండిస్తూ.. అందులో వారి ఉనికిని వెతుక్కుంటుంటారు. అదీ వారు చేశారు అంతే.. కానీ చంద్రబాబు దూరదృష్టిని మాత్రం వారు గ్రహించలేకపోయారు.
Also Read ;- జీనోమ్ వ్యాలీ.. బాబు ఆలోచన విలువ రూ.6 లక్షల కోట్లు
వెంటనే స్పందించారు..
‘విమానాలను పెట్టడానికి హ్యాంగర్ స్థలాన్ని అడిగినప్పుడు వారి నుంచి వచ్చిన స్పందన మరవలేనిది. అప్పట్లో హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు సంస్థకు అటువంటి ఆస్కారమే లేదు. కానీ, ప్రైవేటు పరంగా నా సంస్థకు డిమాండు ఏర్పడే వరకు వారు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. అన్నింటా అండగా నిలిచారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు రావాలన్నా.. రాష్ట్ర రాజధానిలోని మౌలిక సదుపాదాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇలా మా సంస్థ అక్కడ నెలకొల్పిన మీదట.. పది రోజుల్లోనే మా సంస్థ కార్యకల్లాపాలు మొదలుపెట్టింది. దాదాపు 3 సంవత్సరాలపాటు వారు అందించిన తోడ్పాటును నేను ఎన్నటికీ మరువలేను. అంతేకాదు.. సరికొత్త ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి అంకురార్పణ చేసిన వారి దార్శనికతను, దూరదృష్టిని మెచ్చుకోకుండా ఉండలేను. ఆయన పట్టుదలను అభినందనందించకుండా ఉండలేను’ ఇలా చంద్రబాబు గురిచిన ఎన్నో విషయాలను తన వ్యాపార ప్రయాణంలో వారి మద్దతును.. రాష్ట్ర అభివృద్థి ప్రయాణంలో చంద్రబాబును పాత్రను నేటి తరం కళ్లకు కట్టేలా వివరించారు.
అసలెవరీ జి. ఆర్. గోపినాథ్..
కర్నాటకలో గొరూర్ అనే కుగ్రామంలో పుట్టి.. దేశ సేవకు అంకితమై.. ఎయిర్ లైన్ డెక్కన్ వ్యవస్థాపకుడి మారినా గోపినాథ్ క్రమం కూడా ఆదర్శనీయమనే చెప్పాలి. తన వ్యాపార ప్రయాణంలో చంద్రబాబు తోడ్పాటు గురించే కాదు.. రాష్ట్ర అభివృద్ధిని దూరదృష్టితో గాంచి పునాది రాయి వేసిన చంద్రబాబు విజన్ గురించి తెలియజేస్తూ.. తన చరిత్రలో కొన్ని పేజీలను ప్రత్యేకంగా వెచ్చించారు గోపీనాథ్. వ్యాపార పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా దగ్గరైన స్నేహితుడిలాంటి వారని చంద్రబాబు గురించి చెప్పుకొచ్చారు గోపినాథ్. దేశ రక్షణ వ్యవస్థలో అత్యుత్తమ స్థాయిని పొందిన గోపినాథ్ సైతం చంద్రబాబు విజన్ గురించి ప్రత్యేకించి చెప్తుంటేనే అర్థమవుతుంది.. చంద్రబాబు పరిపాలనా దక్షత, విజన్ స్పష్టంగా తెలుస్తుంది.
Also Read ;- చంద్రబాబు అసామాన్య యత్నం.. రైతన్నల త్యాగ ఫలం.. అమరావతి