నటనకు నిలువెత్తు నిదర్శనం.. మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఆయన ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. తెలుగు తెర పై చెరగని ముద్ర వేశారు. ఒక్క తెలుగులోనే కాకుండా.. తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించారు. ఆయన చనిపోయే వరకు నటిస్తానని చెప్పేవారు. అలా చెప్పినట్టుగానే.. నటించారు. ఆయన బెడ్ పై ఉండి కూడా డబ్బింగ్ చెప్పారంటే.. సినిమా అంటే ఎంత ఇష్టమో అర్ధం చేసుకోవచ్చు. ఆయన నటించిన ఆఖరి చిత్రం మనం. ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీకే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలిచింది.
ఇదిలా ఉంటే.. ప్రముఖ నటుడు మురళీమోహన్ తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు తనకు ఇచ్చిన సలహాను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. తాను ఒక సందర్భంలో ఏఎన్నార్ ఇంటికి వెళ్లానని ఆ సమయంలో రాత్రి పూట నువ్వేం తీసుకుంటావ్ అని ఏఎన్నార్ ప్రశ్నించారని మురళీమోహన్ తెలిపారు. తాను ఏం తీసుకోనని మందు అలవాటు లేదని ఏఎన్నార్ కు సమాధానం ఇచ్చానని మురళీమోహన్ పేర్కొన్నారు.
ఆ తరువాత ఏఎన్నార్ నాకు నిద్ర ఎలా పడుతుందని అనుమానంగా అడగగా పడుకోగానే నిద్రపోతానని తాను సమాధానమిచ్చానని మురళీమోహన్ అన్నారు. ఆ తరువాత ఏఎన్నార్ అరవై సంవత్సరాల తరువాత నడుము మెత్తబడుతుందని ఉత్తేజం రావాలంటే రోజుకు రెండు పెగ్గులు తీసుకోవాలని చెప్పారని మురళీమోహన్
తెలియచేశారు. అది కూడా మాంచి ఫారిన్ బ్రాండ్ వాడాలని చెప్పారన్నారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ… ఇసుక అమ్ముకొని కోట్లు సంపాదించానని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
Must Read ;- వెండితెరపై వెలుగులు.. కాసుల్లో కారు మబ్బులు!











