ఈ దివిలో ఏ జీవికీ లేని ఆలోచనలు ఆర్జీవీకే వస్తుంటాయోమే! బోల్డ్ టాక్స్ విత్ అరియానా పేరుతో ఆయన రిలీజ్ చేసిన ఇంటర్యూ బోలెడు కుతూహలాన్ని కలిగిస్తోంది. కుర్రకారు గుండెల్లో ఈ ఇంటర్వ్యూ డంబెల్స్ మోగిస్తోంది.. భళా అనిపిస్తోంది.
‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో మేక మాట్లాడుతోందంటూ దాన్ని ఫ్యాన్సీ ధరకు అమ్మేస్తాడు రాజేంద్ర ప్రసాద్. తెలివైన వాడు దేన్నయినా మార్కెట్ చేసుకోగలడు అనడానికి ఓ ఉదాహరణ ఇదే. మన ఆర్జీవీ కూడా ఈ కోవకే చెందిన జీవి. మేకనే కాదు దాని తోకను కూడా అలాగే అమ్మేయగలడు. పైగా ఫ్రీ పబ్లిసిటీ చేయడానికి సోషల్ మీడియా ఉండనే ఉంది. ఏ ప్రింట్ మీడియాలోనో, వెబ్ మీడియాలోనో వార్తలు రావాలంటే ‘కాస్త’ ఖర్చుతో కూడిన పని. యూట్యూబ్ ఛానల్స్ ను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే రాసుకునే వారికి రాసుకున్నంత మహదేవ.
యూట్యూబ్ లో పోస్టు చేసిన వీడియోలు చూసి ఎవరికి తోచిన రీతిలో వారు రాసేసుకుంటారు. ఆర్జీవీని అరకొర దుస్తులతో ఇంటర్వ్యూ చేసేస్తే బిగ్ బాస్ హౌస్ లోకి పిలుపు వస్తుందని ఆశపడే యాంకర్లు లేకపోలేదు. ఎందుకంటే అరియానాకు వచ్చిన పాపులారిటీ అదే కదా. అదే ఆమెను బిగ్ బాస్ హౌస్ లోకి లాక్కుపోయింది. ఆమె తొడలను వర్ణించి.. ఆమెను బికినీలో చూడాలని ఉందంటూ ఆర్టీవీ చేసిన కామెంట్లు అరియానా ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు డామేజి కాకుండానూ జాగ్రత్తపడుతోంది.
ఇంటర్వ్యూని కూడా చక్కగా జిమ్ లోనే ప్లాన్ చేశారు. మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు ఏమీ లేదు కదా అన్నట్టుగానే అరియానా మాట్లాడుతోంది. అరియానాతో కలిసి జిమ్‌లో హాట్ హాట్ గా ఆర్జీవీ చేసే వర్కవుట్స్ అన్నీ ఉత్తుత్తినే అనుకోండి. మొత్తానికి ఆయనకుగానీ, ఆమెకు గానీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే ఆ ఒక్కటీ అడక్కండి. ఈ ఫుల్ ఇంటర్వ్యూ జూన్ 19వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఎవరు ఎవరికి రుణపడి ఉన్నారో తెలియదు. ఇంటర్వ్యూ ఆసాంతం రచ్చ రంబోలా లాగానే సాగింది.
Must Read హాట్ బ్యూటీ తొడల్ని ముద్దు పెట్టుకున్న వర్మ
https://www.youtube.com/watch?v=m2_mxY6AL58
ఐయామ్ వెరీ సారీ.. అన్నాగా ఇంకోసారి..
ఇదేదో పాటల పల్లవిలానే వీరి ఇంటర్వ్యూ ఉందనుకోవాలి. ఆర్జీవీ జిమ్‌లో ఉండగా.. ఆయ్ ఆర్జీవీ సార్ అంటూ అరియానా ఎంట్రీ. ఆమెను చూసిన వర్మ బిల్డప్ షాక్. అరియానా అంగాంగ వర్ణన. ‘దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ’ అన్నట్టు సాగింది. ఆమె దుస్తుల వర్ణన అయిపోయాక శరీరం వైపు చూపు. ‘నీ క్యాస్ట్యూమ్స్ కంటే నీ బెటర్ క్యాస్టూమ్స్ దేవుడిచ్చిన నీ తొడలు.. నీ థైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా చెప్పాను’ అని వర్మ అనడం.. అరియానా పొంగిపోవడం.. అబ్బో.. ఇక చెప్పలేంలే. ఆమె తక్కువ తినలేదు‘మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా’ అంటూ మొహమాటం. ‘భలే ఛాన్స్‌లే.. లక్కీ ఛాన్స్ లే’ అని వర్మ అనుకోకుండా ఎలా ఉంటారు.
అది కూడా జరిగిపోయింది. ఇలా వర్కవుట్లతో వీరి ఇంటర్వ్యూ సాగిపోయింది. పైగా అరియానా ‘నేను చాలా బోల్డ్‌గా ఉంటా.. అందుకే అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ అంటే ఎఫైర్ అని.. వీళ్లిద్దరికీ ఏదో ఉందని అనుకుంటారు. ఆ టైమ్ లో అమ్మాయి, అబ్బాయి ఎలా రియాక్టవ్వాలి?’ అంటూ అమాయకపు ప్రశ్న. దానికి వర్మ ‘వాళ్లకి ఇష్టం వచ్చింది చేయా’లంటూ జవాబు. వీరి సంభాషణ సన్నీ లియోన్ దాకా సాగిపోయింది. ఈ అరవై, ఇరవై సంభాషణలు రెండూ వర్గాలనూ ఇంటర్వ్యూ ఆసాంతం చూసేలా చేస్తున్నాయి. ఈ రచ్చ రంభోలా ఇంటర్వ్యూని మీరు కూడా పిచ్చిపిచ్చగా ఆస్వాదించేయండి మరి.
– హేమసుందర్
Must Read ;- ఫొటోలు కేక.. ఆర్జీవం ‘నైనా’నందకరం











