‘పిశాసు’ సినిమా తమిళంలో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మరో తమిళ్ దర్శకుడు బాలా నిర్మించారు. ఇదొక వైవిధ్యమైన కథ. ఇందులో దెయ్యం అందరికీ మంచి చేస్తుంది. కోలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ‘పిశాసు’ చిత్రం తెలుగులో ‘పిశాచి’ పేరుతో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా బాగా పే చేసింది. ఇన్నాళ్లకు మళ్ళీ ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు దర్శకుడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఇందులో దెయ్యంగా మలయాళ టాలెంటెడ్ నటీమణి, రవిబాబు ‘అవును’ ఫేమ్ పూర్ణను ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. పూర్ణ వైవిధ్యమైన పాత్రలను చేయడంలో ఎప్పుడూ ముందుటుంది. ఇప్పటికే దర్శకుడు కథను పూర్ణకు వినిపించాడని ఆమె కూడా దర్శకుడి మీద ఉన్న నమ్మకంతో ఓకే చెప్పిందని కోలీవుడ్ టాక్. పూర్ణ మలయాళం, తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి కావడంతో ఆమెను ఫైనల్ చేశారని సమాచారం. ఈ సిక్వెల్ ను ఒకేసారి మూడు బాషలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. సినిమాలో పూర్ణ పాత్ర గమ్మత్తుగా ఉంటుందని, అందరికి ఎప్పుడూ మంచి చేసే పాత్ర అని తెలుస్తోంది. ఇందులో ఒక కొత్త పూర్ణను ప్రేక్షకులు చూస్తారని అంటున్నారు.
ఇక సినిమా విషయానికి వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత జనవరి చివరి వారంలో సినిమా షూటింగ్ మొదలవుతుంది. సింగల్ షెడ్యూల్ తో షూటింగ్ ను పూర్తీ చేసే ప్లాన్ లో ఉన్నాడు మిస్కిన్. అంతేకాకుండా సినిమాకు సంబంధించిన ఎక్కువ భాగాన్ని తమిళనాడులోని దిండిగుల్ అనే ప్రాంతంలో షూట్ చేస్తారని సమాచారం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఇళయరాజా తనయుడు కార్తీక్ రాజా వ్యవహరించబోతున్నాడు. మరి ‘పిశాసు’ మూవీలాగానే.. ‘పిశాసు – 2’ కూడా సూపర్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.
Must Read ;- నిహారిక సంగీత్ లో నల్లకలువలా మెరిసిన రీతూ వర్మ