సంక్రాంతి బరిలో ఇప్పుడు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నట్టుగా ప్రకటించాయి. అయితే.. ఆర్ఆర్ఆర్ వస్తుండడంతో సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ పోటీ నుంచి తప్పుకుంటున్నాయని టాలీవుడ్ లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల విషయంలో క్లారిటీ రావాల్సివుంది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా బంగార్రాజు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
దీపావళి కానుకగా సంక్రాంతికి బంగార్రాజు అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు సంక్రాంతి బరిలో మరో సినిమా నిలించేందుకు రెడీ అవుతుందని తెలిసింది. ఇంతకీ ఏ సినిమా అంటే.. యాంగ్రీమేన్ రాజశేఖర్ నటిస్తున్న శేఖర్. ఈ చిత్రానికి లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రాజశేఖర్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణ లో వస్తున్న ఈ చిత్రాన్ని ఎంఎల్వీ సత్య నారాయణ, శివాని శివాత్మిక, వెంకట శ్రీనివాస బొగ్గరం లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, మల్లికార్జున నారగని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. రాజశేఖర్ 91వ సినిమాగా ఈ చిత్రం రానుంది. సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు భారీ సినిమాలు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఈ నేపథ్యం లో శేఖర్ సినిమాని జనవరి రెండో వారంలో విడుదల చేయాలి అనుకుంటున్నారట. అది కుదరకపోతే.. జనవరి నెలాఖరున విడుదల చేయాలి అనుకుంటున్నారని సమాచారం.
Must Read ;- విజువల్ వండర్ గా ట్రిపుల్ ఆర్ గ్లింప్స్