శృంగారాన్ని మొక్కుబడిగా సాగించేవాళ్ల ఎందరో ఉంటారు. అయితే అందులో రసానుభూతిని ఆస్వాదించే వాళ్లు మాత్రం కొందరే! గొప్ప శృంగారానుభూతికోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలను కూడా చదువుకుంటూ ఉంటారు. ఈ విషయంలో నిత్యం కొత్త కొత్త సంగతులు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసం బాలీవుడ్ శృంగార నాయిక బిపాసా బసు.. తన స్వానుభవంలోంచి ఒక టెక్నిక్ చెబుతోంది.
భర్తలందరూ పడుకునే ముందు ఓ అరగంటపాటు భార్య పాదాలకు మసాజ్ చేయాలట. అలా చేస్తే భార్యలు- భర్త పట్ల ఎంతో ప్రేమ నింపేసుకుంటారట. ఇలాంటి చర్య వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానుభూతి అనేది ఎంతో గొప్పగా పెరుగుతుందని బిపాసా చెబుతోంది.
ఎంతో మంది అభిమానుల హృదయాలకు గిలిగింతలు పెట్టే బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది. ‘నా కరణ్ కూడా అలాగే చేస్తాడు’ అంటూ.. ఈ భార్య పాదాల మసాజ్ టెక్నిక్ గురించి బిపాసా అభిమానులకు సలహా ఇస్తోంది.
మరెందుకు ఆలస్యం.. భార్యల ప్రేమ మరింతగా పొందడానికి బిపాసా చెప్పిన మంత్రాన్ని భర్తలందరూ పాటించేస్తే సరి.!










