గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం రోజుకో టర్న్ తీసుకుంటోంది. బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య పోరు తారా స్థాయికి చేరింది. హిందువుల ఓట్లే టార్గెట్‌గా బీజేపీ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంఐఎం , టీఆర్ఎస్‌లను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక బీజేపీని దెబ్బతీసేందుకు వరద సాయం నిలిపివేతను వాడుకునే ప్రయత్నం చేశారు టీఆర్ఎస్ నేతలు. అయితే అది తిరిగి, ఆ పార్టికే చెడ్డపేరు తెచ్చిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నేతలు లేఖపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది. సంజయ్ మాటలతో బీజేపీ ఓ వర్గం ఓట్లను పార్టీకి పూర్తిగా దూరం చేసే అవకాశం ఉండటంతో పార్టీ మరో ప్లాన్‌తో ముందుకు వస్తోంది.
Also Read:-బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదురుతోంది!
ఆ పార్టీలు ముస్లీంలకు చేసిందేమీ లేదు..
ఎప్పుడు హిందువులను వెనకేసుకొచ్చే బీజేపీ నేతలు ఈ సారి ముస్లీంలను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సడన్‌గా ముస్లింల సంక్షేమానికి బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాలను చర్చకు తీసుకువచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు త్రిపుల్ తలాక్ నుండి విముక్తి కల్పించామని చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ , ఎంఐఎంలు ముస్లీంలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్ప వారి అభివృద్ధికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదంటూ ఘాటుగా స్పందించారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ముస్లీంలను టీఆర్ఎస్,ఎంఐఎం రెండు పార్టీలు తమ వారీగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంలకు ముస్లీంల అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే పాత బస్తీ ఎందుకు అలాగే ఉండిపోయిందని ప్రశ్నిస్తున్నారు. వారికి అవసరం అయినప్పుడు వారిమీద ప్రేమ కురిపించే ఈ రెండు పార్టీలు ఆ తరువాత వారి అభివృద్ధిని మరిచి పోతున్నాయంటున్నారు.
Also Read:- బీజేపీలోకి చేరుతున్న జీహెచ్ఎంసీ మాజీ మేయర్
మైనారిటీలను వారు దోచుకు తింటున్నారు..
ముస్లీంలను ఆ రెండు పార్టీలు దోచుకు తింటున్నాయని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని , ముస్లీంల పార్టీగా చెప్పుకునే ఎంఐఎం కూడా చూస్తూ కూర్చింది తప్ప చేసిందేమీ లేదంటూ ఎదురు దాడికి దిగారు. ముస్లీంలకు రిజర్వేషన్లు కావాలంటే బీజేపీకే ఓటేయాలని చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా రాష్ట్రంలో , నగరంలో ముస్లిం ప్రజలు కడు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని.. వారికి ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వడం లేదంటూ ముస్లింల పక్షాన ప్రకటనలు చేయడం ఒక్కసారిగా రాజకీయ చర్చనీయాంశంగా మారింది. మైనారిటీల కోసం టీఆర్ఎస్ పార్టీ హిందువులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఓ వైపు బండి సంజయ్ దూకుడుగా మాట్లాడుతుంటే, మరోవైపు ముస్లింల అభివృద్ధి కోసం బీజేపీ కట్టుబడి ఉందని అర్వింద్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నేతల ప్రకటనలతో నగర ప్రజలు కన్ఫ్యూజన్‌లో పడుతున్నారు.
Also Read:-టీఆర్ఎస్‌ను ముంచిన ‘మూడో బటన్’.. హరీశ్ నోట ఆ మాట !