2019 ఎన్నికల్లో వైసీపీ రికార్డు విక్టరీ కొట్టింది. అంతకుముందు 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ విజయంపై గట్టి ధీమాతోనే వైసీపీ బరిలోకి దిగింది. అయితే టీడీపీ చేతిలో చిత్తుగా ఓటమిపాలైంది. స్వయంగా జగన్ తల్లి వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో విజయం సాధించాలంటే.. ఏం చేయాలన్న దిశగా ఆలోచించిన జగన్.. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి అధికారం దక్కేలా వ్యూహాలు రచించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో అప్పటికే ఫుల్ డిమాండ్ లో ఉన్న పీకే ఎంత అడిగితే అంత చెల్లించేందుకు ఒప్పేసుకున్న జగన్ ఆయన సేవలను వినియోగించుకున్నారు. ఫలితంగానే 2019 ఎన్నికల్లో వైసీపీ రికార్డు విక్టరీ కొట్టింది. మరి ఈ గెలుపు జగన్‌దా? లేదంటే ప్రశాంత్ కిశోర్‌దా?.. వ్యూహాలు రచించింది పీకేనే అయినా.. క్షేత్రస్థాయిలో జనం వద్దకు వెళ్లింది జగనే కాబట్టి.. వైసీపీదే విక్టరీ అని జనం చెప్పుకున్నారు.
అదే సీన్ రిపీట్ అయితే..?
మరో రెండున్నరేళ్లలో 2024 ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నాన.. వచ్చే ఏడాది మార్చి నుంచి పీకే టీమ్ రంగంలోకి దిగుతుందని గురువారం నాటి కేబినెట్ భేటీలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారట. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు.. వచ్చే ఏడాది మార్చి నుంచి లెక్కించుకుంటే.. ఎన్నికలకు రెండేళ్ల సమయమున్నట్లే లెక్క. రెండేళ్ల నుంచే రాజకీయ వ్యూహాలు అమలు చేసేందుకు పీకే టీమ్ ను జగన్ రంగంలోకి దింపుతున్నారంటే.. ఎన్నికలంటేనే జగన్ కు భయం పట్టుకున్నట్టుగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఒక సారి అంటే ఏమోలే అనుకోవచ్చు గానీ.. వరుసగా రెండో సారి కూడా పీకే వ్యూహాలనే ఆశ్రయిస్తున్నారంటే.. జగన్ కు తన సత్తా ఏమిటో తెలిసిపోయినట్టే కదా. అంటే మునుపటి ఎన్నికల్లో తన సత్తాతోనే గెలవలేదని జగన్ తేల్చేసినట్టే కదా. పీకే సత్తాతోనే తాను విజయం సాధించినట్లుగా జగన్ ఒప్పేసుకున్నట్లే కదా. అంటే.. వైసీపీకి దక్కిన రికార్డు విక్టరీ పీకేదే గానీ.. జగన్ ది కాదని తేలిపోయినట్టే కదా.
పీకే వస్తే అందరూ డమ్మీలే
పీకేకు జగన్ ఇచ్చినంత ఎలివేషన్ ఏ ఒక్కరూ ఇవ్వలేదనే చెప్పాలి. పీకే సేవలను చాలా పార్టీలే వినియోగించుకున్నా.. ఏ ఒక్క పార్టీ కూడా తమ అంతర్గత సమావేశాల్లో, బహిరంగ సమావేశాల్లో పీకేను ప్రొజెక్ట్ చేస్తూ ప్రకనటలు చేయలేదనే చెప్పాలి. అయితే అందుకు విరుద్ధంగా తన పార్టీ సమావేశంలో పీకేను అందరికీ పరిచయం చేసిన జగన్.. ఆ విషయాన్ని మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిపారు. ఈ క్రమంలో పీకేకు జగన్ ఓ రేంజి ఎలివేషన్ ఇస్తే.. వైసీపీకి చెందిన ఇతర నేతలను పీకే టీమ్ అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ కారణంగా ఆయా నియోజకవర్గాల్లో టికెట్ తమకేనంటూ చివరిదాకా సాగిన నేతలకు కూడా పీకే టీమ్ నివేదికలతో టికెట్లు దక్కలేదు. ఈ తరహా అనుభవాలు చాలా మందికే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ అధికారంలో ఉన్నా కూడా మళ్లీ పీకే అవసరం ఏమిటని, ఆయన వస్తే సిట్టింగ్ లుగా ఉన్న తమకు కూడా టికెట్ దక్కుతుందో, లేదోనన్న భయం వైసీపీ ఎమ్మెల్యేల్లోనే కాకుండా మంత్రుల్లోనే నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్‌కు రిలీఫ్.. సాక్షిని బుక్ చేసిందే











