దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇజ్రాయిల్ కార్యలయం సమీలంలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, పేలుడు జరగడానికి కొద్ద సమయం ముందు ఇద్దరు వ్యక్తులు క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు రికార్డు అయింది. వారికి, పేలుడు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని అక్కడకు తీసుకువచ్చిన క్యాబ్ డ్రైవర్‌ను తీసుకుని పోలీసులు వారి ఊహా చిత్రాలను సిద్ధం చేయిస్తున్నారు.
ఈ పేలుడు పదార్థాలను పరిశీలించిన మీదట, అందులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం. ఘటనా స్థలంలో సగం కాలిన పింక్, ఓ ఎన్వలప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్వలప్‌లో ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ‘ఇది ట్రైలర్ మాత్రమే’ అని రాసి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు లెటర్‌లో ఖాసీం సులేమానీ పేరు ఉన్నట్లు సమాచారం. గతేడాది బాగ్దాద్‌లో ఖాసీం సులేమానీ దారుణ హత్యకు గురయ్యాడు. ఇజ్రాయిల్ రాయబారిని బెదిరిస్తూ లేఖ రాసినట్లు తెలియవచ్చింది.
ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడులో ఇరాన్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు సమాచారం. ఆ ఫుటేజీని పరిశీలించగా.. టైమ్ స్టాంప్ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేకపోవడం గమనార్హం.
ఢిల్లీలోని పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల్ని అప్రమత్తం చేశారు. ముంబైలోని ఇజ్రాయిల్ కన్సులెట్ కార్యలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.
Must Read ;- రైతుల దీక్షలోకి అరాచక శక్తులు, ఢిల్లీ ఉద్రిక్తం










