తెలుగు తెరపై కీర్తి సురేశ్ .. పూజా హెగ్డే జోరు ఒక రేంజ్ లో సాగుతోంది. సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మలు అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు. తమ అభిరుచులను .. అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. రీసెంట్ గా వాళ్లు షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాలైంటైన్ వీక్ సందర్భంగా మొన్న 12వ తేదీన చాలామంది సెలబ్రిటీస్ ‘హగ్ డే’ విషయంలోను తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ రోజున తన కుక్కపిల్ల ‘నైకా’ను హగ్ చేసుకున్న ఫొటోను కీర్తి సురేశ్ పోస్ట్ చేసింది.

క్యూట్ గా ఉండే తన కుక్కపిల్లను హగ్ చేసుకుని సోఫాలో అలాగే ఒరిగిపోయిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కీర్తి సురేశ్ అభిమానుల్లోని కుర్రాళ్లు మాత్రం, ఈ మధ్యకాలంలో ఇంత అదృష్టం చేసుకున్న కుక్కపిల్లను చూడలేదని ఈర్ష్య పడుతున్నారు. ఇక పూజా హెగ్డే విషయానికొస్తే, ఆమె తన తల్లిని ప్రేమతో హగ్ చేసుకున్న ఫొటోను వదిలింది. అయితే దీని సందర్భం వేరే. పూజా హెగ్డే తల్లి పుట్టినరోజు కావడం వలన, ఆమె అలా తన ప్రేమను వ్యక్తం చేసింది. తన తల్లి ప్రేమను మాటల్లో చెప్పలేననీ, కవినై ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కవిలా తన తల్లి ప్రేమను అక్షరాల రూపంలో చెప్పలేను గనుక, తనకి తెలిసిన ప్రేమను మాత్రమే పంచుతున్నానని రాసుకొచ్చింది. తన విషయంలో తన తల్లి కన్నకలలు నిజం చేయడానికి ప్రయత్నిస్తాననీ, ఆమె గర్వపడేలా నడచుకుంటానని భరోసా ఇస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక కీర్తి సురేశ్ నుంచి ‘గుడ్ లక్ సఖి’ .. ‘రంగ్ దే‘ సినిమాలు విడుదలకి ముస్తాబవుతూ ఉండగా, ‘సర్కారువారి పాట’ సెట్స్ పై ఉంది. పూజా హెగ్డే నుంచి రావడానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ .. ‘రాధేశ్యామ్‘ సిద్ధమవుతున్నాయి.
Must Reac ;- ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. ఎవరితోనో తెలిస్తే షాకే











