May 4, 2026 4:50 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

ప్రేమ ఎంత మధురం.. భజరంగ దళ్ అంత కఠినం?

కాలం మారుతోంది.. మరి ప్రేమ కూడా మారాలి కదా. ఇద్దరి మధ్య ఉన్నది ఏ రిలేషన్ షిప్ అయినా ఆ షిప్ మునిగిపోకుండా ఉంటే అంతే చాలు. ఆ షిప్ మునిగిపోకుండా ఉన్న రోజే నిజమైన ప్రేమికుల రోజు.

February 13, 2021 at 5:59 PM
in Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ప్రేమ- ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పదమే. ఎందుకంటే ఎన్నో సినిమాలకు ఇది కనకవర్షం కురిపించింది.. మరెన్నో కావ్యాలకు అంకురార్పణ చేసింది. మనిషిని దేవదాసును చేసినా, మనసుని పిచ్చిదాన్ని చేసినా అది ప్రేమకు ఉన్న బలమే తప్ప మరేమీ కాదు. మనం బలహీనంగా ఉంటే అది మనల్ని మింగేస్తుంది అనే వారూ ఉన్నారు.

ప్రేమ కోసం మహా మహా యుద్ధాలే సాగాయి. రాజులు, రాజ్యాలు ఈ ప్రేమ యుద్ధంలో మునిగి తేలాయి. అలాంటి ప్రేమకు ఒక్కటంటే ఒక్క రోజు ఉండటంలో తప్పేముంది అంటారా?.. ఏమో అది భజరంగ్ దళ్ వాళ్లే తేల్చాలి. ఫిబ్రవరి 14.. పేమికుల రోజు వచ్చేసింది.. యువత జీవితంలో ప్రేమే ఓ పెద్ద పరీక్ష. ఇందులో పాసైతే ఎందులో తప్పినా చిక్కేమీ లేదనుకుంటారు. ప్రేమ ఇంత మధురమే కాబట్టి దాని మీద సినిమాల్లో ఎన్నో పాటలు కూడా వచ్చాయి.

‘ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం.. మా బాబు చెప్పినా బ్రహ్మ చెప్పినా ససేమిరా వినం’ అంటూ పాడుకుంటారు ఓ సినిమాలో జంట. ఈ పాటను కొసరాజు రాసినా ఈ ప్రేమ జీవితాల్లో కొసమెరుపు వేరేగా ఉంటోంది. ప్రేమ లేని సినిమా ఉప్పులేని పప్పులాంటిది అని దర్శక నిర్మాతలు అనుకోవచ్చు. జనం చూస్తున్నారంటే దాన్ని అంగీకరించి తీరాలేమో కదా. ఇక తప్పు చేయని ప్రేమ కథలు కూడా ఉంటాయా అంటే చెప్పలేం.

ఈరోజు మనకు ఎవరిచ్చారు?

రోజూ ప్రేమించుకునే వారికి ప్రత్యేకమైన రోజు ఎందుకో? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు మన దగ్గర కూడా దొరకదు. ప్రేమకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యానికి ఓ డెస్టినేషన్ ఉండాలి. మూడో శతాబ్దంలోకి వెళదాం. రోమ్ చక్రవర్తి క్లాడియస్ కు పెళ్లి మీద నమ్మకం లేదు. దాంతో ఎవరికీ పెళ్లిళ్లు జరగడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. పెళ్లి చేసుకుంటే సైన్యం బలహీనపడుతుందని ఆయన నమ్మకం.

ఏ బంధమూ లేనివారే చావుకు భయపడకుండా యుద్ధంలో పోరాడగలరనేది ఆయన అభిప్రాయం. అందుకే పెళ్లిళ్లు జరగకుండా చట్టం చేశాడంటారు. ఆయన నిర్ణయాన్ని మత గురువు వాలెంటైన్ వ్యతిరేకించాడు. పెళ్లి చేసుకోడానికి ఇష్టపడేవారికి రహస్యంగా పెళ్లిళ్లు చేశాడు. తన నిర్ణయాన్ని ధిక్కరించిన వాలెంటైన్ పై క్లాడియస్ ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. వెంటన్నే ఆయన్ని జైల్లో బంధించాడు. క్రీస్తుశకం 269 ఫిబ్రవరి 14న వాలెంటైన్ కు ఉరిశిక్ష విధించాలని ఆదేశాలు ఇచ్చాడు.

జైలులో ఉండగా జైలు అధికారి కూతురితో వాలెంటైన్ ప్రేమలో పడ్డాడట. ఆమె అంధురాలు కావడంతో తనకు తెలిసిన వైద్యం చేసి ఆమెకు చూపు తెప్పించాడట వాలెంటైన్. ఆ క్రమంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ అంకురించింది. తనకు ఉరి శిక్ష పడేముందు ఆమెకు ఓ ప్రేమ సందేశం పంపారట. అందులో ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని రాశాడట. అతనికి ఉరిశిక్ష పడిన రోజు ఫిబ్రవరి 14 కాబట్టి అతని పేరు మీదుగా ఈ వాలెంటైన్ డే ఏర్పడిందని చెబుతుంటారు.

Must Read ;- ప్రేమంటే ఇదేరా అంటున్న ముద్దుగుమ్మలు 

ఒక్క రోజు దూరంగా ఉంటే ఏం పోతుంది?

జంట కన్నుల పంటగా కనిపిస్తే ఓర్వలేని వారు కూడా ఉంటారు. అందుకే ఈ ప్రేమికుల రోజుని ద్వేషించే మనుషులూ, సంస్థలకు కొదవ లేదు. ప్రేమను ద్వేషించే బదులు ప్రేమ కథా వస్తువుతో తెరకెక్కే సినిమాలను కూడా నిషేధించాలి కదా.. అలా చేయరు. ‘కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు’ అనే డైలాగుల్ని వ్యతిరేకించరు. ఎంచక్కా సినిమాలు, డైలాగులు ఎంజాయ్ చేసేస్తుంటారు. ఈరోజున బహిరంగ ప్రదేశాల్లో జంటలు కనిపిస్తే భరతం పట్టే వారు తయారయ్యారు. అన్నాచెల్లెళ్లు కలిసి కనిపించినా వారి మాటలు వినకుండా ఘనకార్యం చేస్తున్నవారూ ఉన్నారు.

అందుకే మీ ప్రియురాలితో ఈరోజు ఎంచక్కా షికారు చేద్దామనుకుంటే ఒక్క రోజు వాయిదా వేసుకుంటే పోయేదేముంది. ముఖ్యంగా భజరంగ దళ్ ఈ జంటల భరతం పట్టడానికి రెడీ గా ఉంది. బహిరంగ ప్రదేశాల్లో జంటలు కనిపిస్తే తమ పని తాము చేసుకుపోతామని ఇప్పటికే హెచ్చిరకలు జారీ చేసింది. వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదనేది వీరి వాదన. అది పాశ్యాత్య విష సంస్కృతిగా వీరు పేర్కొంటున్నారు. ఈరోజును అమర జవాన్లకు గుర్తుగా అమరవీర్ జవాన్ దివస్ గా జరుపుకోవాలని వారు కోరుతున్నారు. ప్రేమికుల మీద వీరికి ఇంత కసి ఎందుకని వాదించే వారూ ఉన్నారు.

Also Read ;- జీవితంలో ఇదే ఆల్ జీబ్రా.. సెక్స్ లేకుంటే ‘గుండె’ గాభరా

ప్రేమ మధురమైతే మరి బ్రేకప్పో?

ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమ లేకుంటే మానవ సమాజ మనుగడే లేదు. అయితే ఆ ప్రేమలు వికటించడం వల్లే చిక్కులొస్తున్నాయి. ప్రేమ అంటే యువతీ యువకుల మధ్య శృంగారం అనేలా అర్థం మారిపోయింది. పైగా టీనేజ్ లోనే ప్రేమించుకోవడం మొదలెట్టేస్తున్నారు. ఒకప్పుడు బాల్య వివాహాలను ఆమోదించిన సమాజం టీనేజ్ ప్రేమను ఎందుకు ఆమోదించలేకపోతోందన్న వాదన కూడా వీరి నుంచి వస్తోంది. సాధారణంగా ఈ టీనేజ్ ప్రేమలు ఏవీ నిలబడటం లేదు. అవకాశం దొరికినప్పుడు ఎవరి మధ్య ఆయినా ఆకర్షణ ఏర్పడుతుంది.

అవకాశం లేనప్పుడు ఎలాంటి ప్రేమా ఉండదు. ప్రేమ అనే స్థానంలో లివింగ్ రిలేషన్ షిప్ అనే పదం కూడా వచ్చి చేరింది. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చాక వారి నిర్ణయానికే తల్లిదండ్రులు కూడా ఓటేస్తున్నారు. కాకపోతే ప్రేమకు ఉండే అర్థం మారిపోతోంది. ప్రే అంటే ప్రేమించడం, మ అంటే మరచిపోవడంగా మారిపోయింది. అందుకే ప్రేమ అనే పదం ఎంత మధురంగా వినిపిస్తుందో, బ్రేకప్ అనే పదం అంత చేదుగానూ కనిపిస్తోంది.

ఒక ప్రేమ పెళ్లిగా మారేలోపు ఎన్ని బ్రేకప్ లు ఉంటున్నాయో అంతుబట్టకుండా ఉంది. కొన్నాళ్లు పోతే బ్రేకప్ రోజును కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు వచ్చేస్తుందేమో. అందుకే ప్రేమకూ, బ్రేకప్ కూ అంతరం లేని ప్రేమ కావాలి. వివాహం – విడాకులు, ప్రేమ – బ్రేకప్ లాంటి జంట పదాలకు కాలం చెల్లిందని చెప్పుకునే రోజు కోసం అందరూ ఎదురుచూడాలి. ది రిలేషన్ షిప్ బిట్వీన్ టు పర్సన్స్ మస్ట్ బీ లైక్ ఏ ఫిష్ అండ్ వాటర్.. అప్పుడే ఆ వాటర్ లోని షిప్ మునిగిపోకుండా ఉంటుంది. అప్పుడే ప్రేమికుల రోజుకు సరైన నిర్వచనమూ దొరుకుతుంది.

– హేమసుందర్ పామర్తి

Also Read ;-  ప్రేమికుల రోజే మనసు విప్పుతుందట శ్రీముఖి?

Tags: about valentines dayleotopspeciality of valentines dayvalentine day full story in teluguvalentine day love storyvalentine day real storyvalentine's day origin storyvalentine's day story behindvalentine's day story in englishvalentine's day story instagramvalentine's day storytimevalentines dayvalentines day cupid storyvalentines day datevalentines day imagesvalentines day listvalentines day newsvalentines day quotesvalentines day story
Previous Post

నాగార్జున‌సాగర్ అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ..

Next Post

పాస్‌పోర్టు కోసం హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్..

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

‘పరిమితి’కి మించి ఇదేం ‘వాడ‌కం’ స్వామీ?

యానిమల్ (రివ్యూ)

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

శర్వానంద్ కు జోడీగా కన్నడ బ్యూటీ

Anupama Parameswaran Super Hot Looks | Anupama Parameswaran Latest Cute Video | Leo Entertainment

‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి

మాట ఇస్తున్నాం.. మరచిపోతున్నాం..  మన్నించుమా.. గురజాడ

మోడీజీ! తెగేదాకా లాగితే తలనొప్పి తప్పదు!

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist