ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. కన్నవారిద్దరికీ కంటి చూపులేదు. పుట్టిన పిల్లలే వెలుగుదివ్వెలయ్యారు. కష్టాలు, కన్నీళ్లు..చుట్టూ ముసిరిన చీకట్లను చీల్చుకుంటూ.. బడిలో అక్షరాలు దిద్దాల్సిన చేతులతో ఆటో నడుపుతున్న చిత్తూరు జిల్లాకి చెందిన 8 ఏళ్ల బాలుడు గోపాలరెడ్డి కుటుంబానికి సాయం అందించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నడుం బిగించారు. తక్షణ సాయంగా తానే రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారు. బ్యాటరీ ఆటో కోసం చేసిన అప్పు తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ రూ.2 లక్షల సాయం అందించనుందని వెల్లడించారు. తల్లిదండ్రులు, గోపాలరెడ్డి కోరిక మేరకు ఏ స్కూల్లో చదవాలనుకుంటే అక్కడి విద్యాభ్యాసానికి అయ్యే మొత్తం ఖర్చు భరిస్తామని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
మీడియాలో బాలుడి కష్టం వైరల్
ఎనిమిదేళ్ల వయస్సులో కుటుంబ బరువు బాధ్యతల్నిమోస్తోన్న బుడతడి కష్టాలు చూసి నారా లోకేశ్ చలించిపోయారు. కళ్లులేని తల్లిదండ్రులు, లోకం పోకడ తెలియని ఇద్దరు తమ్ముళ్లకు తానే పెద్దదిక్కయిన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లె గ్రామానికి చెందిన గోపాలరెడ్డి బ్యాటరీ ఆటో నడుపుతూ అందులో పప్పులు, ఉప్పులు వేసుకుని ఊరూరా తిరిగి అమ్ముతున్నాడు. దీనిపై మీడియాలో ప్రసారమైన కథనాలు వైరల్ అయ్యాయి. ఇది చూసిన వెంటనే స్పందించిన నారా లోకేశ్ చాలా వేగంగా స్పందించారు. సాయం అందించేందుకు ముందుకొచ్చారు. చిట్టిచేతులతో గోపాలరెడ్డి ఇకపై ఆటో నడపాల్సిన అవసరం లేదు. ఆటోకి తీసుకున్న అప్పు తీరిపోనుంది. నచ్చినచోట చదివించేందుకు నారా లోకేశ్ అన్ని చర్యలూ తీసుకుంటామని ప్రకటించారు.
సాయం చేతులే మిన్న!
స్పందించే మనసున్న నారా లోకేశ్ పార్టీ అధికారంలో లేదు. అయినా కూడా కొన్ని పార్టీలకు చెందిన నేతల మాదిరిగా అధికారంలోకొచ్చాక సాయం చేస్తానని ముద్దులు పెట్టి తప్పించుకోలేదు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే.. బాలుడికి అవసరమైన సాయం తన సొంత డబ్బులతో అందించేందుకు ముందుకొచ్చారు. కష్టాలు తీరిపోవాలని టెంకాయలు కొట్టండని చెప్పే నేటి పాలకుల కన్నా.. ఆపదలో ఉన్నారంటే ఆదుకుంటూ.. కష్టంలో ఉన్నారంటే కదిలి వచ్చి సాయంగా నిలుస్తోన్న నారా లోకేశ్ చేతులు మిన్న అంటూ టీడీపీ శ్రేణులు తమ నేత స్పందనపై ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. బాలుడికి నారా లోకేశ్ సాయం, ఆ సాయంపై టీడీపీ శ్రేణుల కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- నారా లోకేశ్ స్పీచ్ ఊర మాస్











