టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మధ్యన ఒక షెడ్యూల్ ను ఇటలీలో పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది చిత్ర బృందం. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ఈ సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే పాన్ ఇండియా సినిమాలో నటించనున్నాడు.
‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రామునిగా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించనున్నాడు. దర్శకుడు ఓంరౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాలేదు. ప్రభాస్ పుట్టిన రోజున ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చిత్ర యూనిట్ అప్డేట్ చేస్తారని అభిమానులు ఎదురు చూసారు. కాని ఆ రోజు కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ దీపావళికి ‘ఆదిపురుష్’ టీం సాలిడ్ అప్డేట్ తో వస్తోందని బాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి.
సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు, హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు, మిగిలిన పాత్రలలో ఎవరు నటిస్తున్నారు అనే అంశాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడని తెలుస్తోంది. ఎందుకంటే దీపావళి పండుగ ‘ఆదిపురుష్’ సినిమా కథకు ఎంత ప్రత్యేకమో తెలిసిందే. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే మరి. ఇక ‘ఆదిపురుష్’ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో ఉన్న రికార్డులను కూడా తిరగ రాస్తుందని అభిమానులు వాపోతున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా తర్వాత ‘మహానటి’ ఫెమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.