ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో సక్సెస్ సాధించడం తెలిసిందే. ఆతర్వాత అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సినిమాలు కూడా హిట్ అవడం, కాస్త గ్లామర్ తోడవడంతో స్టార్ హీరోయిన్ అయ్యింది. టాలీవుడ్ లో మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రాంచరణ్ ఇలా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చింది. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇటీవల చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రకుల్ మునుపటి జోరు తగ్గినప్పటికీ మంచి ఆఫర్సే అందుకుంటోంది. అయితే తాజాగా రకుల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ లేవంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తల పై రకుల్ మండిపడుతూ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో అరడజను పైగా చిత్రాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ తర్వాత అన్ని చిత్రాల షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేయడం కుదరడం లేదని చెప్పింది.
అందువల్లనే టాలీవుడ్ ఆఫర్స్ ని వదులుకోవాల్సి వస్తోంది అని రకుల్ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే.. రకుల్ కు టాలీవుడ్ లో అవకాశాలే రావడం లేదని వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు రావడం రకుల్ కి బాగా కోపం తీసుకువచ్చాయి. తనదైన స్టైల్ లో స్పందించింది. ‘నాకు ఓ విషయం అర్థం కావడం లేదు.. వీళ్ళు హెడ్డింగులు పెడుతున్నట్లు నాకు టాలీవుడ్ లో ఆఫర్స్ రావడం లేదని ఎప్పుడు చెప్పాను?’ అని ప్రశ్నించింది. అంతేకాకుండా.. ‘ప్రస్తుతం ఆరు చిత్రాలు చేస్తున్నా, 365 రోజుల్లో 6 చిత్రాలకు కాకుండా కొత్త ఆఫర్స్ వస్తే వాటికి డేట్స్ ఎలా సర్దుబాటు చేయాలో కాస్త చెప్పండి. నా టీమ్ కు ఆ విషయంలో సాయం చేయండి’ అంటూ సెటైర్ వేసేసింది రకుల్.
ఈ విషయాన్ని రకుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. డైరెక్టర్ దర్శకుడు హరీష్ శంకర్ సపోర్ట్ చేశాడు. ‘రకుల్ సంగతి నాకు తెలుసు.. నా స్నేహితుడు చెప్పినా స్క్రిప్ట్ నీకు నచ్చినప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. ఇలాగే దూసుకుపో.. నీ వర్క్ తో అందరికీ సమాధానం చెప్పు’ అని హరీష్ శంకర్.. రకుల్ కి సపోర్ట్ చేయడం విశేషం. తనకు హరీష్ లాంటి దర్శకుడు మద్దతు పలకడంతో ఈ భామ ఖుషీ అయిపోయింది.
Must Read ;- మెగా కాంపౌండ్ లో హరీష్ మరో ప్రయాణం











