డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయిరామ్ శంకర్ అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఇడియట్’, ‘నేనింతే’ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన సాయి ‘143’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే యాక్టింగ్ లో పర్లేదు అనిపించుకున్న సాయి తర్వాత కాలంలో నటించిన ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’ సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు
Also Read:-‘శివమణి’తో మళ్ళీ ‘సూపర్’ కాంబినేషన్
ఆ తర్వాత సాయి నటించిన వరుస సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కొంతకాలం గ్యాప్ తీసుకోని ఇప్పుడు ‘రీసౌండ్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్న ‘రీసౌండ్’ సినిమాతో ఎస్. ఎస్. మురళీ కృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో సాయికి జోడిగా హీరోయిన్ రాశీ సింగ్ నటిస్తోంది. లాక్ డౌన్ విధించిన కొన్ని నెలల ముందే ఈ సినిమా షూటింగ్ మొదలై 70శాతం చేసుకుంది.
ఆతర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. మరల తిరిగి ఈనెల 16వ తేదీన చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యింది. శరవేగంగా షూటింగ్ ను జరుపుకొని వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పలు ఓటీటీ సంస్థల నుండి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
ఈ సినిమాను థియాటర్స్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందని వారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అసలే వరుస పరాజయాలు పలకరిస్తున్న సాయికి ‘రీసౌండ్’ సినిమా చాల ముఖ్యమైందనే చెప్పాలి. ఈ చిత్రంపై సాయి రామ్ శంకర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అనడంలో సందేహం లేదు. ఎలాగైనా హిట్ కొట్టి మరల తన సత్తా చాటాలని చూస్తున్నాడు హీరో సాయి. మరి ‘రీసౌండ్’ సినిమా హిట్ అయ్యి సాయి రామ్ శంకర్ సినీ జీవితం మలుపు తిరుగుతుందో లేదో చూడాలి మరి
Must Read:-సాయిరామ్ శంకర్ ‘బంపర్ ఆఫర్’ సీక్వెల్ ?