మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అవ్వాలి. కాని కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తర్వాత ఈమధ్యనే తిరిగి షూటింగ్ మొదలైంది. అయితే ఇప్పటివరకు చిరంజీవి లేని సన్నివేశాలను తెరకెక్కించాడు కొరటాల శివ. చిరు అతిత్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. దానికోసం ఆయన తన మేకోవర్ ను కూడా చేంజ్ చేసుకున్నారు.
ఇప్పుడు ‘ఆచార్య’ సినిమాపై ఒక అప్డేట్ వచ్చింది. షూటింగ్ నిమిత్తం నిర్మాతలు నాలుగు కోట్ల వ్యయంతో హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ని నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ సెట్ లోనే ఆచార్య షూటింగ్ అధిక శాతం జరుగుతుందట. చిరంజీవి, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను ఈ సెట్ లోనే జరపడానికి ప్లాన్ చేస్తున్నాడట కొరటాల. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక దేవాలయాల సెట్స్ ను వేసిన విషయం తెలిసిందే. చిరు షూటింగ్ లో అడుగుపెట్టిన వెంటనే సింగల్ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నాడు శివ. ఎట్టి పరిస్థితిల్లో వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు దర్శకుడు శివ కూడా ఒక కారణం . కొరటాల శివకు ఒక్క పరాజయం కూడా లేకపోవడం వలన ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ‘ఆచార్య’ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే చిరు ‘లూసిఫర్’ రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఆచార్య సినిమాకి భారీ సెట్ ఏ రేంజ్ లో హైలైట్ అవుతాయో చూడాలి.
Must Read ;- మెగాస్టార్ తో ఆడిపాడేందుకు ఎవరూ ఉండారా?











