నైట్ క్లబ్స్ అనేవి ముంబైలో చాలా కామన్. కానీ వాటికి కూడా నిబంధనలు ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా అబాసుపాలక తప్పదు. అటువంటి పరిస్థితే ఎదురైంది మన భారతీయ క్రికెటర్ సురేష్ రైనాకు. ‘చిన్నతల’ అంటూ తమిళ అభిమానుల చేత ముద్దుగా పిలవబడే రైనా, ముంబై ఎయిర్ పోర్టుకు దగ్గరలోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై అర్థరాత్రి 2:30 గంటల సమయంలో పోలీసులు రైడ్స్ చేశారు. ఆ సందర్భంలో నియమావళిని పాటించకుండా క్లబ్‌లో ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ దాడుల్లో సురేష్ రైనాతోపాటు బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా పిలవబడే హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానే ఖాన్, సింగర్ గురు రంధవానును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్లబ్ స్టాఫ్‌తో పాటు 34 మందికి అరెస్ట్ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా క్లబ్ నిర్వహించారంటూ కేసు నమోదు చేశారు. అలాగే సురేష్ రైనా.. ఇంకొందరు ప్రముఖులు కూడా కొవిడ్ నియామవళి పాటించకపోవడంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఆపై బెయిల్‌పై రైనాను విడుదల చేసినట్టు ఎస్‌ఆర్‌పి సహర్ తెలియజేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రైనా ఐపిఎల్ 2020 నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే.
Must Read ;- విశాఖలో భారీగా పట్టుబడిన నగదు, వెండి, గంజాయి