కరోనా తగ్గడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్ లు స్టార్ట్ అవుతున్నాయి. త్వరలో థియేటర్లు ఓపెన్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే.. మామ – అల్లుడు డేరింగ్ స్టెప్ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే..
మామ -అల్లుడు డేరింగ్ స్టెప్ వేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ… ఎవరా మామ అల్లుడు అనుకుంటున్నారా..? మామ విక్టరీ వెంకటేష్ అయితే.. అల్లుడు నాగచైతన్య. మేటర్ ఏంటంటే.. విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. తమిళ్ లో విజయం సాధించిన అసురన్ మూవీకి ఇది రీమేక్. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించిన నారప్ప సినిమాని ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది.
తాజా వార్త ఏంటంటే.. ఇటీవల ఫ్యాచ్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ కి రెడీగా ఉంది. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తే.. అప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ చిత్ర నిర్మాతలు. ఇక వెంకీ అల్లుడు నాగచైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీలో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటించింది. ఈ సినిమాలోని పాటలకు ట్రెమండస్ రెస్సాన్స్ రావడం.. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో లవ్ స్టోరీ అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా కారణంగా వాయిదాపడింది. ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు లవ్ స్టోరీ చిత్రం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. కరోనా తగ్గి థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే సినిమాలు రిలీజ్ చేస్తే.. జనాలు థియేటర్లకు వస్తారా..? రారా..? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మామ అల్లుడు వెంకీ – చైతు డేరింగ్ స్టెప్ తీసుకుని తమ సినిమాలు రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. మరి.. ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
Mjust Read ;- వెంకీ ల్యాండ్ మార్క్ మూవీకి దర్శకుడు ఈయనేనా?