సినీ నటుడు ఉత్తేజ్ భార్య పద్మ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె వయసు 48 సంవత్సరాలు. ఆమె గత కొంతకాలంగద క్యాన్సర్ తో బాధపడుతున్నారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. నటుడు ఉత్తేజ్ నెలకొల్పిన మయూఖ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ బాధ్యతలను ఆమె నిర్వహించే వారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
పెద్ద కుమార్తె చేతన మంచి డ్యాన్సర్, నటి. చిన్న కుమార్తె పాట కూడా మంచి డ్యాన్సర్. ఉత్తేజ్ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టినా వాటిని భార్య పద్మ దగ్గరుండి పర్యవేక్షించేవారు. ఉత్తేజ్ భార్య పద్మ మరణించిందన్న వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత, రాజశేఖర్, బ్రహ్మాజీ తదితరులు ఆస్పత్రికి వెళ్లి ఉత్తేజ్ ను పరామర్శించారు.
Must Read ;- ప్రకాష్ రాజ్ కి షాక్ ఇచ్చిన బండ్ల గణేష్. తెర వెనుక ఏం జరిగింది?