కోలీవుడ్ లో అద్భుతమైన విజయాలతో .. మంచి దర్శకుడు అనిపించుకున్నాడు వెట్రిమారన్. ఆయన సినిమాల్లో పెయిన్ అండ్ ఎమోషన్స్ తో పాటు సహజత్వం కూడా ఒట్టిపడుతుంటుంది. ‘పొల్లాదవన్, ఆడుకళాం, విచారణై, వడచెన్నై, అసురన్’ లాంటి సినిమా లతో ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వెట్రిమారన్ మరో .. వెరైటీ కథతో వస్తున్నాడు . సినిమా పేరు ‘విడుదలై’. గురువు లాంటి ఒక ఖైదీ, శిష్యుడు లాంటి ఒక పోలీస్ మధ్య ఉన్న రిలేషన్ ను ఈ సినిమా ఎలివేట్ చేయబోతోంది. ఇందులో ఖైదీగా విజయ్ సేతుపతి నటిస్తుండగా.. పోలీస్ గా కమెడియన్ సూరి నటిస్తున్నారు. తమిళ రచయిత జయ్ మోహన్ రాసిన ఒక చిన్న కథ ఈ సినిమాకి ఆధారం.
ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను విడుదల చేశారు మేకర్స్. బేడీలేసిన విజయ్ సేతుపతి చుట్టూ పోలీసు లు రివీలవగా.. వారిలో ఒక పోలీస్ గా సూరి కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్సాన్స్ వస్తోంది. ఆర్.ఎష్. ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. దీనికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ సినిమా విడుదలవుతోంది. తమిళ నాడులోని సత్యమంగళం అడవుల్లో ఈ సినిమా అధిక భాగం చిత్రీకరణ జరుపుకుంది. మరి ఈ సినిమాతో విజయ్ సేతుపతి కూడా నేషనల్ అవార్డ్ అందుకుంటాడేమో చూడాలి.
Must read ;- కమల్ హాసన్ కు విలన్ గా విజయ్ సేతుపతి ?
Here it is @VetriMaaran ‘s #Viduthalai first look posters.#Ilaiyaraja @sooriofficial @elredkumar @rsinfotainment @VelrajR @mani_rsinfo @DoneChannel1 @CtcMediaboy pic.twitter.com/DxfKG1Lv9m
— VijaySethupathi (@VijaySethuOffl) April 22, 2021