ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘ఆహా’ అందించిన వెబ్ సిరీస్ లో ‘సిన్’ ఓ ప్రత్యేకతను చాటుకుంది. నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా దర్శకుడు నవీన్ మేడారం దీన్ని తీర్చిదిద్దారు. శరత్ మరార్ నిర్మించిన ఈ సిన్ ఎలా ఉందో ఓసారి చూద్దాం. మార్చి 25 నుంచి ‘ఆహా’లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఇప్పటిదాకా చాలామంది వీక్షించారు. ఈ సిన్ సెకండ్ సీజన్ కోసం నచ్చినవారు ఎదురుచూస్తున్నారు.
కథేంటి? : చాలామంది తల్లిదండ్రులు ‘మా అబ్బాయి నోట్లో వేలు పెడితే కూడా కొరకలేడు’ అంటుంటారు. అందరూ ఇంట్లో రామయ్యలే… వీధిలోకి వెళితేనే అసలు రంగు కనిపిస్తుంది. ఈ సిన్ లో ఆనంద్ కూడా ఆ తరహానే. మహిళలంటే ఎంతో గౌరవం గలవాడిగా కనిపిస్తాడు కానీ లోపల మనిషి అలా ఉండడు. నందిత అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత నైనా అనే మరో అమ్మాయితో ఎఫైర్ కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నదే కథ.
ఎలా తీశారు?: చెప్పదలుచుకున్న విషయాన్ని దర్శకుడు సూటిగా స్పష్టంగా చెప్పాడు. పరిమితుల దృష్ట్యా త్వరగా కథ ముగిసిపోయిందని అనిపిస్తుంది. ఆనంద్ గా తిరువీర్ బాగా నటించాడు. దొంగచూపులు చూసే మగవారు ఎలా ఉంటారో అలానే కనిపించాడు. ఎమోషన్ మిస్సయ్యింది. మసాలా అంశాలకేమీ కొదవలేదు. నేపథసంగీతం ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ అనేసరికే బడ్జెట్ పరిమితులు ఉంటాయి కాబట్టి మనం కూడా సరిపెట్టుకోవచ్చు.
ఒక్కమాటలో…: పెళ్లామైనా బలవంతపు శృంగారం చేయరాదనే సందేశం ఈ సిన్ లో అంతర్గతంగా కనిపిస్తుంది. ‘ఆహా’లో అడల్డ్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందని ముందే అల్లు అరవింద్ చెప్పారు కాబట్టి చాలామంది దానికోసమే చూస్తున్నట్టున్నారు.
ఎక్కడ చూడాలి? : ఆహా
నటీనటులు: తిరువీర్ రెడ్డి, జెన్నిఫర్, దీప్తి సతి, రవివర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు: సంగీతం సదాశివుని సిద్ధార్ధ్, సినిమాటోగ్రఫీ సిద్ జే, ఎడిటింగ్ అజీమ్ మహమ్మద్, టించు ఫిలిప్, అరుణ్.
నిర్మాణం : శరత్ మరార్
రేటింగ్ : 2/5