ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ‘ఆహా’ అందించిన సినిమా ”జోహార్’. ఇందులో సినిమా లో సంక్షేమ పథకాల వెనుక మహా నేతలు, నాయకులు, పాలకులు ఎలా మేత మేస్తారో.. ప్రజలు దానికి ఎలా బలవుతారో చక్కగా చూపించారు. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం స్ఫూర్తితో ఈ‘జోహార్’ కథ తయారైనట్లుంది. ప్రజాధనం ఎలా వృధా అవుతుందో ఇందులో చూపారు. సమకాలీన సమస్యలే ఈ సినిమా కథావస్తువు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలు చూద్దాం.
కథేంటి? : ఇది ఒకే కథకు సంబంధించినది కాదు. నాలుగు కథలు సమాంతరంగా నడుస్తాయి. ఒక కథ వారణాశిలో వేశ్యావాటికకు సంబంధించినది. అక్కడినుంచి బయటపడిన యువతి ఏంచేసిందనేది కథ. ఇంకో కథ విషయానికి వస్తే ఓ స్వాతంత్య్ర సమరయోధుడు ఆశ్రమం నడుపుతూ… అది శిథిలావస్థలో ఉండడంతో నిధుల కోసం ప్రభుత్వానికి అర్జీ పెడితే ఏంజరిగిందనేది. రోడ్డు మీద సర్కస్ ఫీట్లు చేసే యువతి అథ్లెట్ కావాలనుకుంటే ఏమైంది అనేది ఇంకో కథ. తండ్రి మరణం తర్వాత ముఖ్యమంత్రి అయిన కొడుకు తన తండ్రి విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకుంటాడు. నిధులు లేకపోవడంతో రాష్ట్రానికి కేటాయించిన బడ్జెట్ నుంచి కొంత తీసి విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తాడు. అతని కోరిక వల్ల పైన చెప్పుకున్న వారి జీవితాలు ఎలా ఛిద్రమవుతాయి… ఆ విగ్రహం నిలబెట్టడం కోసం అలాంటి ఎందరి బతుకులు నేలరాలాయి అన్నదే ‘జోహార్’ కథ.
ఎలా తీశారు?: కథలు బాగున్నా కథనాల్లో లోపం ప్రస్ఫుటంగా కనిపించింది. వాటిని ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఎక్కడా ఎమోషన్ పండలేదు. ఇన్ని కథలు కలపడం అంత తేలికైన అంశం కాదు. గతంలో క్రిష్ తెరకెక్కించిన ‘వేదం’ ఈ విషయంలో సఫలమైంది. మాటలు బాగున్నాయి. ప్రభుత్వాల తీరు ఎలా ఉంటుందన్నది మాత్రం చక్కగా చూపగలిగారు. నిధులు ఎలా దుర్వినియోగం అవుతాయో, నేతలు ఎలా వ్యవహరిస్తారో, పథకాల ప్రయోజనాలు ఏమిటో లాంటి అంశాలన్నీ బాగున్నాయి. కాకపోతే తెరకెక్కించన విధానంలోనే లోపాలు కనిపించాయి. అందువల్ల ఈ సినిమా ఆలోచింపలేకపోయింది. ఇది కేవలం ఓటీటీ కోసం తీసిన సినిమాలా అనిపించింది.
ఎక్కడ చూడాలి? : ఆహా
బ్యానర్: ధర్మసూర్య పిక్చర్స్
తారాగణం: అంకిత్ కొయ్య, ఎస్తేర్ అనిల్, శుభలేఖ సుధాకర్, చైతన్య కృష్ణ, నైనా గంగూలి, ఈశ్వరి రావు తదితరులు
రచన: రామ్ వంశీకృష్ణ
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణ్యన్
కూర్పు: సిద్ధార్థ్ తాతోలు, అన్వర్ అలీ
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
రచన: నిఖిల్ మెహోత్రా, శరణ్ శర్మ
నిర్మాతలు: సందీప్ మార్ని, రత్నాజీరావు మార్ని
కథ, కథనం, దర్శకత్వం: తేజ మార్ని
విడుదల తేదీ: ఆగస్ట్ 14, 2020
వేదిక: ఆహా
రేటింగ్ : 2/5
హంట్ మూవీ రివ్యూ
హీరో సుధీర్ బాబుకు ఈమధ్య సరైన హిట్లు లేవు. అప్పుడెప్పుడో సమ్మోహనంతో హిట్...