ఫైర్ బ్రాండ్, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేపై మండిపడింది. దసరా సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం ఉద్ధవ్ థాక్రే కంగనా రనౌత్‌పై పరోక్షంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైకు బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళు ఈ నగరాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చారని, వారిని ప్రజలు క్షమించరని, వారు ప్రజల దృష్టిలో నీచులుగా, నమ్మకద్రోహలుగా మిగిలిపోతారని ఉద్ధవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు కంగనా సీఎం ఉద్ధవ్ థాక్రేకు ట్విట్టర్ ద్వారా దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
హిమాలయాల సౌందర్యం భారతీయులందరికీ చెందినట్టుగానే ముంబై ఇచ్చే అవకాశాలు కూడా అందరికీ చెందుతాయని చెప్పింది కంగనా. సీఎం ఉద్ధవ్ థాక్రే నన్ను నమ్మక ద్రోహి అన్నారు. అందరికన్నా పెద్ద నమ్మక ద్రోహి ఉద్ధవ్ థాక్రేనే అని ఆమె అన్నారు. ముంబై నాకు షెల్టర్ ఇవ్వకపోతే నాకు తిండి కూడా దొరకదని అన్నారు థాక్రే, దసరా పండుగ రోజున సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మహారాష్ట్ర పరువు తీశారని కంగనా ఘాటుగా స్పందించింది.
తాను నెపోటిజం బ్రాండ్ కాదని, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వ్యక్తినని చెప్పుకున్న కంగనా, మీలా నేను తండ్రి ఆస్తులను, డబ్బులను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రాలేదని ఆమె తెలిపింది. తాను తండ్రి సంపాదనపై ఆధారపడి బతకాలనుకుంటే తన సొంత రాష్ట్రంలోనే ఉండేదాన్ని, కాని సొంత కాళ్ల మీద నిలబడి, స్వయంశక్తితో ఈ స్థాయికి ఎదిగి మంచి గుర్తింపు తెచుకున్నానని ఆమె పేర్కొంది. వీలైతే ప్రజలకు మంచి చేయాలి కాని ప్రజలను రెచ్చకొట్టడం మంచిది కాదని, ప్రజాస్వామ్య హక్కులను హరించే సాహసానికి పూనుకోవద్దని కంగనా సీఎంకు ట్విట్టర్ ద్వారా హితవు పలికింది. మరి ఈ ట్విట్ పై శివసేన కార్యకర్తలు, నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.