(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
మంత్రి అప్పలరాజు గారు పొరపడ్డారో .. తడబడ్డారో .. రాజకీయ దురుద్దేశంతో సర్థార్ గౌతు లచ్చన్నకు కులం ఆపాదించారో తెలీదుగాని .. మీ రాజకీయ రొంపిలోకి ఆయన విగ్రహాన్ని ఈడ్చుకొచ్చారు. మీరు ఏదో ఊహిస్తే .. ఇంకేదో జరిగింది. మీ మైలేజీని పూర్తిగా డేమేజ్ చేసింది. అందువల్ల మీరు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు.. మీరే సెలవిచ్చినట్టు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేస్తే సరిపోదు .. అంతకంటే ఇంకో అడుగు ముందుకేసి లచ్చన్న విగ్రహం ఉన్న ప్రాంతాన్ని స్మారకవనంగా తీర్చిదిద్దాలి. అప్పుడే లచ్చన్న విగ్రహం విషయంలో మీ మీద పడ్డ మచ్చ కొంతవరకు మాగిపోయే అవకాశం ఉంటుంది .. పై చిత్రం చూస్తే పలాసలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన వారికి అట్టే అర్థం అవుతుంది. ఇంచుమించు అదే జరిగింది.
స్మారకవనంగా ..
సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం ఉన్న ప్రాంతాన్ని రాజకీయాలకు తావులేకుండా స్మారకవనంగా మార్చాలని ఆల్ ఇండియా శ్రీశయన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వి.మహేష్‌దేవ్ కోరారు. ఇటీవల గౌతు లచ్చన్న విగ్రహ విషయంలో మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై శ్రీకాకుళం జిల్లాలో దుమారం రేగింది. ఈ నేపథ్యంలో పలాసలో మంత్రి అప్పలరాజుతో కలసి వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పలాసలో ఇటీవల జరిగిన ఘటన బాధాకరమన్నారు. మంత్రి అప్పలరాజు ఒక మాట అంటే అది రాజకీయంగా గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. లచ్చన్న ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదన్నారు. దీనిపై మంత్రితో మాట్లాడామన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరగా, మంత్రి ఒకసారి పలాస వచ్చి పరిస్థితిని తెలుసుకోవాలని కోరడంతో తామంతా వచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు, అధికారుల నుంచి సమాచారం సేకరించామన్నారు.
ఆల్ ఇండియా శ్రీశయన సంఘం వినతి
లచ్చన్న విగ్రహం ఉన్న ప్రాంతాన్ని రెగ్యులైజ్ చేసి అక్కడ స్మారకవనం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చామని మహేష్‌దేవ్ తెలిపారు. ఇందుకు మంత్రి అప్పలరాజు అంగీకరించారన్నారు. సంఘ గౌరవాధ్యక్షుడు రాంబాబు, అధ్యక్షుడు మన్మధరావు, ప్రధాన కార్యదర్శి శాస్త్రి, యువజన విభాగ అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- మాట జారి ఇరుక్కున్న మంత్రి అప్పలరాజు..!











