మాలీవుడ్ కంప్లీట్ యాకర్ట్ మోహన్ లాల్ .. ఇటీవల ‘దృశ్యం 2’ మూవీతో ఒటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆయన ఓ అదిరిపోయే మాస్ యాక్షన్ మూవీతో రాబోతున్నారు. సినిమా పేరు ‘ఆరాట్టు’. మోహన్ లాల్ తో గతంలో గ్రాండ్ మాస్టర్, మిస్టర్ ఫ్రాడ్, విలన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించిన బి. ఉన్నీకృష్ణన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆరాట్టు’ సినిమా టీజర్ ను విడుదల చేశారు.
మోహన్ లాల్ యాక్షన్ తో కూడిన విజువల్స్ తో నిండిపోయిన టీజర్ లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది. అది కూడా తెలుగులో. నేను వాడిని చంపేస్తాను అనే తెలుగు డైలాగ్ తో ఎవరికో వార్నింగ్ ఇవ్వడంతో టీజర్ ఎండ్ అవుతుంది. అంటే.. మోహన్ లాల్ తో తలపడే విలన్ ఇందులో తెలుగువాడై ఉంటాడని అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆరాట్టు టీజర్ .. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేడు ఉదయం 11 గంటలకు విడుదలైన టీజర్ .. రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. లూసిఫర్ తర్వాత అంతటి పవర్ ఫుల్ పాత్రతో మోహన్ లాల్ రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
Must Read ;- అఖిల్ ‘ఏజెంట్’ కోసం మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ ?