తమ ఇంటి అవసరాలకు తగ్గట్టు సొంతగా పంటలు పండించుకోవాలన్న ఆకాంక్షే నమ్రతను రైతుగా మార్చిందట. ఓ వైపు ఇంటి బాధ్యతలు, మరోవైపు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూనే మహేష్ బాబుకు వృత్తిపరంగా చేదోడువాదోడుగా నిలుస్తూ నమ్రత తనకు తనే సాటి అనిపించుకున్నారు. అంతేకాదు మహేష్ తాను నటించే సినిమాలకు పారితోషికంతో సరిపెట్టుకోకుండా నిర్మాణంలో భాగస్వామిగా మరింత ఎక్కువ డబ్బు సంపాదించేలా ప్లాన్ చేసింది నమ్రతే. ఎంబీ ఎంటర్ టైన్మెంట్ పేరుతో ఆ మధ్య ఓ సంస్థను ప్రారంభించి “శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, సరిలేరు నీకెవ్వరు” చిత్రాలలో ఇతర నిర్మాతలతో కలసి నిర్మాణ భాగస్వామ్యాన్ని మహేష్ దంపతులు పంచుకున్న సంగతి తెలిసిందే.
ఇలా మహేష్ కు అన్నివిధాలా అండగా ఉంటూనే హైదరాబాద్ పరిసరాల్లోని తమ సొంత ఫామ్ హౌస్ లో వరి, పత్తి టమోటాలు, పచ్చి మిర్చి వంటి వివిధ రకాల పంటలను నమ్రత పండిస్తుండటం ఓ విశేషం. ఆ మేరకు ఫామ్ హౌస్ టూర్ వీడియో తీసి. దానిని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు. ఆసక్తి ఉండాలేగాని మనిషి అనితర సాధ్యం ఏముంటుంది. మొత్తం మీద నమ్రత పండించిన పంటలను సోషల్ మీడియాలో చూస్తూ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇదిలావుండగా, ఇంతవరకు తాను నటిస్తున్న సినిమాలకు మాత్రమే నిర్మాణ భాగస్వామ్యాన్ని వహించిన మహేష్ ఇప్పుడు అడవి శేష్ హీరోగా నటిస్తున్న “మేజర్” చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. మహేష్ దంపతుల అభిరుచికి ఇది అద్దంపడుతుంది. ఇక హీరోయిన్ సాయిపల్లవి కూడా మహేష్ ను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టింది. “అందానికి అందం మహేష్ బాబు. నలభై దాటినా ఆయన ముఖంలో బ్రైట్ నెస్ అలానే ఉంది” అంటూ తన ట్వీట్లో ఆమె పేర్కొంది. త్వరలో “సర్కారు వారి పాట” చిత్రంలో మహేష్ తో కలసి ఆమె నటించనుంది.
Must Read ;- మహేష్ ఆ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడని నమ్రత హింట్ ఇచ్చారా..?